Viral News : తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పులు పిల్లలపై ప్రభావం చూపుతాయి. పిల్లల ప్రవర్తన అనేది వారి పెంపకం పైనే ఆధారపడి ఉంటుంది. చిన్న వయసు నుండి వారిని సక్రమమైన మార్గంలో నడిపించేలా చేయాలి. అయితే నేటి కాలంలో కొందరు పిల్లల తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మరి కొంతమంది పిల్లలు ఆట వస్తువుల కోసం తల్లిదండ్రులను మారాం చేస్తూ ఉంటారు. వారికి కావాల్సింది ఇచ్చేవరకు ఇలాగే చేస్తుంటారు. అయితే ఇలాంటి వారిని మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఓ బుడ్డోడు దానికి పూర్తిగా విరుద్ధమని చెప్పాలి. ఎలాగైనా బైకు కొనాలి అనే కోరిక తో ఏకంగా తండ్రికే ఎసరు పెట్టాడు . ఇక ఈ బుడ్డోడు చేసిన పని చూసి నేటిజనులు ఆశ్చర్యపోతున్నారు. వీడు చేసిన పని చూసి ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. వివరాల్లోకేళ్తే
ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. యాష్ అనే వ్యక్తికి 8 ఏళ్ల వయసుగల కొడుకు ఉన్నాడు. అయితే యాష్ తన కొడుకు కు ఇష్టమైన వస్తువులు కొనేందుకు డబ్బులు ఎలా పొదుపు చేసుకోవాలనే విషయాలపై తరచు అవగాహన కల్పిస్తూ ఉండేవాడట. ఈ క్రమంలోనే పాత బూట్ల ను ఆన్లైన్ ద్వారా ఎలా విక్రయించాలో కూడా తెలియజేసాడు. అయితే పిల్లలకు సంబంధించిన బైక్ కావాలని పిల్లాడు తండ్రిని అడుగుగా దానికోసం ఇప్పటి నుండి డబ్బులు పొదుపు చేసుకోమని తండ్రి చెప్పారట.
దీంతో ఎలాగైనా సరే బైక్ కొనుక్కోవాలని పిల్లాడు అనుకున్నాడు. దీనికోసం తల్లి ఫోన్ తీసుకొని దానిలోని ఓ యాప్ ద్వారా తండ్రికి సంబంధించిన ఖరీదైన వస్తువులను విక్రయానికి పెట్టాడు. ఖరీదైన ఉంగరం మరియు వాచ్ ను £100 (రూ. 10,242.15 ) లకు అమ్మకానికి పెట్టారు. ఆ తర్వాత మెసేజ్‌లు ఫోన్ కాల్స్ రావడంతో తల్లిదండ్రులు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బాలుడు చేసిన పని చూసి నేటిజనులు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఎంతకు తెగించావు రా బుడ్డోడా అంటూ కొందరు, వీడు మామూలోడు కాదని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More