Child Artist : “బంగారం” సినిమాలో నటించిన ఈ చిన్నారిని గుర్తుపట్టారా…ఇప్పుడు మలయాళీ స్టార్ హీరోయిన్…

Child Artist : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఎక్కడ ఏం జరిగినా ఆ సమాచారం ఇట్టే అందరికీ తెలిసిపోతుంది. మరి ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వార్తలు క్షణాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కొత్త ట్రెండు పుట్టుకొచ్చింది. అదే సినీ తారల చిన్ననాటి ఫోటోలు. దీంతోపాటు బాల నటులుగా నటించిన కొందరు పెద్దయ్యాక ఇలా ఉన్నారంటూ ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాలో నటించిన చిన్నారి ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండిగ్ గా మారాయి.

పవన్ కళ్యాణ్ నటించిన “బంగారం” సినిమా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమా 2006లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేస్తుంది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ చెల్లి గా ఓ చిన్నారి నటించి అందరిని ఆకట్టుకుంది. అయితే ఆ సినిమాలో వింధ్యరెడ్డి పాత్రలో నటించిన ఆ మలయాళ ముద్దుగుమ్మ అసలు పేరు శనూష. మలయాళం లో బాలనాటిగా పలు చిత్రాల్లో నటించి రెండు రాష్ట్ర స్థాయి అవార్డులను కూడా గెలుచుకుంది.

ఆ తర్వాత బంగారం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ సినిమా సమయంలో ఆమె వయసు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. అలా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైన ముద్దుగుమ్మ , “జీనియస్” అనే సినిమాతో హీరోయిన్ గా ఏంటో ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లభించలేదు. దీంతో తమిళ్ రీమెక్ గా వచ్చిన “రేణిగుంట” సినిమాలో కీలకపాత్రలో నటించింది. ఆ తర్వాత నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాలో జర్నలిస్టు పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మలయాళం లో ఓ వెబ్ సిరీస్ చేస్తూ శనూష బిజీగా ఉంటుంది.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More