Anand Mahindra : గతేడాది వచ్చిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇటీవలే ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయింది. అయితే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు సామాన్య ప్రజల దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కాలు కదిపారు. ఇటీవల ప్రముఖ ఆటోమొబైల్స్ దిగ్గజం మహీంద్రా మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
హైదరాబాదులో వరల్డ్ ఛాంపియన్ షిప్ రేసు జరిగింది. ఈ రేసు ముగిసాక మహేంద్ర రేసింగ్ టీం యజమాని ఆనంద్ మహేంద్ర రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులు వేసి అలరించారు. ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఆనంద్ మహేంద్ర హైదరాబాద్ ఫార్ములా – ఈ రేసుకు వెళ్లడం వలన రేసుతో పాటు బోనస్‌గా రామ్ చరణ్ దగ్గర నాటు నాటు స్టెప్ నేర్చుకున్నాను. థ్యాంక్యూ రామ్ చరణ్ ఆస్కార్ కోసం గుడ్ లక్” అని ట్విట్టర్లో రాసుకొచ్చారు.
ఈ రేసులో జీన్ ఎరిక్ విన్నర్‌గా నిలిచడు. రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు. అయితే ఈ రేసులో భారత్ కు చెందిన మహీంద్రా, జాగ్వార్ టీసీఎస్ రేసింగ్ టీమ్‌లు కూడా పాల్గొన్నాయి. మహీంద్రా రేసింగ్ టీమ్‌కు చెందిన ఒలివర్ రోలాండ్ 6వ స్థానంలో నిలవగా, అదే జట్టుకు చెందిన లూకాస్ డి గ్రాస్సి 14వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ రేసును చూడటానికి సినీ ప్రముఖులు క్రీడాకారులు వచ్చారు.
Must Read : Football : అమెరికాలో ఫుట్ బాల్ ఆడబోతున్న తెలుగు అమ్మాయి ..
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More