Niharika Konidela – Chaitanya : వెంకట చైతన్య సంచలన వ్యాఖ్యలు…..విడాకులు తీసుకోబోతున్నామని చెప్పకనే చెప్పాడుగా…నిహారిక రియాక్షన్ ఏంటంటే…

Niharika Konidela – Chaitanya : మెగా డాటర్ నిహారిక కొణిదల తన భర్త వెంకట చైతన్యతో విడాకులు తీసుకున్నట్లు గత నాలుగు నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా వస్తున్న వార్తలకు గల కారణం సోషల్ మీడియాలో వీరిద్దరి బిహేవియర్ అని చెప్పాలి. అయితే మొదట వెంకట చైతన్య తన ఇంస్టాగ్రామ్ నుండి వారి పెళ్లి ఫోటోలు తొలగించగా , కొన్ని రోజుల తర్వాత నిహారిక కూడా వారి పెళ్లి ఫోటోలతో పాటు వెంకట చైతన్య తో దిగిన ఫోటోలను డిలీట్ చేసేసింది. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్దాలు వచ్చాయని అందుకే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాక ఈ మధ్యకాలంలో వారిద్దరు కలిసి కనిపించింది లేదు. ఎక్కడికైనా సరే నిహారిక ఒక్కతే వెళ్తున్నారు.

అంతేకాక ఇటీవల నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగగా, అక్కడకు కూడా నిహారిక ఒంటరిగానే వచ్చారు. తన భర్త వెంకట చైతన్య మాత్రం ఆ ఎంగేజ్మెంట్ లో అసలు కనిపించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం వీరు వేరువేరుగా జీవిస్తున్నారని , త్వరలో విడాకులు తీసుకుంటారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా వెంకటచైతన్య చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. అయితే ఇటీవల మహారాష్ట్రలోని గ్లోబల్ విపాసన మెడిటేషన్ సెంటర్ ని చైతన్య సందర్శించారు. పది రోజులపాటు అక్కడే నివసించారు. మానసిక ప్రశాంతత పొందేందుకు వెంకట చైతన్య అక్కడికిి వెళ్లినట్లు సమాచారం.

ఇక అక్కడ తాను అనుభూతి చెందిన విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఊహకు మించిన శాంతిని పొందగలిగానని తెలియజేశారు. ఈ నేపథ్యంలో నిహారికతో విడాకులు కారణంగా మానసికంగా క్షీణించిన వెంకటచైతన్య ప్రశాంతత కోసం ఈ మెడిటేషన్ సెంటర్ ను సందర్శించినట్లు సోషల్ మీడియాలో వాదన మొదలైంది. అంతేకాక చైతన్య వారి విడాకుల విషయాని చెప్పకనే చెప్పినట్లు కథనాలు వెలువడుతున్నాయి . అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే , ఇంతవరకు మీరు విడాకులపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి వీరిద్దరి మధ్య ఈ ఎడబాటుకు గల కారణం ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More