Coconut Oil : కొబ్బరి నూనెతో పసుపు దంతాలకు చెక్….

Coconut Oil  : కొబ్బరి నూనె చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలును కలుగజేస్తుంది. ఉత్తమ మాయిశ్చరైజర్ గా పరిగణించబడే కొబ్బరి నూనెను అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇక దీని ద్వారా కలిగే నష్టం కూడా చాలా తక్కువ. కొబ్బరి నూనెలో మన చర్మాన్ని లోపల మరియు వెలుపల నుంచి రక్షించే అనేక రకాల పోషకాలు దాగి ఉన్నాయి. రాత్రివేళ కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవడం వలన మరుసటి రోజు ఉదయం వరకు దీని ప్రభావం కనిపిస్తుంది. అయితే ఈ కొబ్బరి నూనె ఉపయోగించి ఏడు సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం….

పసుపు దంతాలకు చెక్…

కొబ్బరి నూనెలో లారీక్ యాసిడ్ ఉంటుంది. అలాగే దీనిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది దంతాలలోని బ్యాక్టీరియాను చంపి దంతక్షయాన్ని నివారిస్తుంది. చిగుళ్ల వాపు మరియు దంతాల సున్నితత్వాన్ని కాపాడుతుంది. అంతేకాక దంతాలను తెల్లగా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. అయితే పసుపు దంతాలను తెల్లగా చేసుకోవాలంటే వారానికి రెండు లేదా మూడుసార్లు కొబ్బరి నూనెతో దంతాలకు మసాజ్ చేయాలి.

జుట్టు రాలే సమస్య…

ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇది. అయితే జుట్టు రాలిపోతుంది అని మీకు అనిపించినప్పుడు వెంటనే కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం ప్రారంభించాలి. వారానికి రెండు లేదా మూడుసార్లు కొబ్బరి నూనె జుట్టు పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత షాంపు మరియు కండిషనర్ ను ఉపయోగించి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు దృఢంగా మారడమే కాక నిగనిగలాడుతూ మెరిసిపోతుంది.

గోర్లను రక్షిస్తుంది…

కొబ్బరి నూనె గోర్లు మరియు దాని చుట్టూ ఉన్న చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. రాత్రివేళ పడుకునే ముందు కొబ్బరినూనె కోర్లకు మరియు దాని చుట్టూ ఉన్న చర్మానికి కొబ్బరినూనె అప్లై చేసుకుని పడుకోవాలి. తద్వారా గోర్ల చుట్టూ చర్మం పగిలే సమస్య నుండి రక్షణ పొందవచ్చు.

కనురెప్పలు….

కనురెప్పలు అనేవి కళ్ళకు మరియు ముఖానికి అందాన్ని పెంచుతాయి. ఇక ఈ కనురెప్పలను బలంగా దట్టంగా చేయాలనుకుంటే నిద్రించే ముందు వాటిపై కొబ్బరి నూనె అప్లై చేసుకోవాలి. అయితే కొబ్బరి నూనె కంట్లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించడం మంచిది .

పెదవులు….

చలికాలంలో పెదవులు విపరీతంగా పగిలిపోతుంటాయి. అలాగే వేసవిలో పెదవుల చర్మం పొడి బారినట్లు అవుతుంది. తేమ లేకపోవడం వలన పెదవి పగుళ్లు రావడంతో పాటునొప్పి కూడా వస్తుంది. అయితే ఈ సమస్యతో బాధపడేవారు రోజుకు కనీసం రెండు మూడుసార్లు కొబ్బరి నూనెను పేదలకు రాసుకోవాలి..

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీన్ని ధ్రువీకరించలేదు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More