Ram Charan – Upasana : మెగా ఇంట నవ్వుల పంట…ఆడబిడ్డ కు జన్మనిచ్చిన ఉపాసన కొణిదల…

Ram Charan – Upasana  : మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మూడోతరం ఇటీవల అడుగు పెట్టింది. రామ్ చరణ్ మరియు ఉపాసన ఇటీవల తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఉపాసన కొణిదల జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఇద్దరు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రసవం సమయంలో చిరంజీవి మరియు సురేఖ , రామ్ చరణ్ ఇతర కుటుంబ సభ్యులు ఉపాసనతో కలిసి రాత్రి ఆసుపత్రికి వచ్చారు.వారసురాలి రాకతో అందరూ చాలా సంతోషించారు. అయితే చరణ్ ఉపాసనలకు 2012లో వివాహం జరిగింది.

పెళ్లయిన ఇన్ని సంవత్సరాల తర్వాత వీరిద్దరూ తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబ సభ్యులతో పాటు ,అభిమానులు సంతోషిస్తున్నారు. అయితే వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని గతేడాది డిసెంబర్ 12న అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఉపాసనకు సీమంతం వేడుకలు కూడా ,ఘనంగా జరిపించారు. ఇక ఇప్పుడు వీరికి పాప పుట్టడంతో కొనిదల మరియు కామినేని కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి చేరుకుని వారసురాలని ఆహ్వానించారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన ఎవరైనా పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడతారు కానీ మేము అలా ఉండేందుకు ఇష్టపడటం లేదని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతమైతే అత్తమామలతో కాస్త దూరంగా ఉంటున్నాము కానీ బేబీ పుట్టిన తర్వాత మాత్రం అత్తమామలతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఉపాసన తెలిపింది. నా ఎదుగుదలలో గ్రాండ్ పేరెంట్స్ కీలక పాత్ర వహించారని, ఇక ఆ ఆనందాన్ని నా బిడ్డకు దూరం చేయడం నాకు ఇష్టం లేదంటూ ఉపాసన తెలియజేసింది. ఏది ఏమైనా మరోసారి మెగా ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. మొన్న వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ తో మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పగా , ఇక ఇప్పుడు రామ్ చరణ్ తన బేబీతో మరో గుడ్ న్యూస్ తీసుకురావడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి..

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More