Junior N.T.R : కొరటాల శివ మరియు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాబోతున్న చిత్రం దేవర.. ఇక ఈ సినిమా పోస్టల్ బ్యాక్ డ్రాప్ తో పాన్ ఇండియా రేంజ్ లో తేరకెక్కబొతుంది. ఇక ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో రాబోతుందని చిత్ర బృందం చెప్పడంతో ఈ సినిమాపై భారి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కొన్ని నెలలుగా జరుగుతూ వస్తుంది. ఇంకా అప్పటినుండి చిత్ర బృందం సినిమా షెడ్యూలను పూర్తి చేస్తూ వస్తుంది. ఇలా ఇప్పటివరకు దాదాపుగా మూడు మేజర్ షెడ్యూల్స్ ను హైదరాబాదులోని కొన్ని ప్రాంతాలలో కంప్లీట్ చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలోని మరో షెడ్యూల్ త్వరలో మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ ను హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో మరి కొన్ని రోజుల్లో మొదలు మొదలుపెట్టబోతున్నారట. దీనికోసం సముద్రపు వాటర్ ను పోలి ఉండే భారీ ట్యాంకర్ ను సినీ బృందం నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ మరియు సైఫ్ అలీ ఖాన్ మధ్య ఓ యాక్షన్ సీక్వెన్స్ జరగబోతున్నట్లు సమాచారం. అయితే ఈ షూట్ లో అండర్ వాటర్ ఫైట్ కోసం హీరో ఎన్టీఆర్ డూప్ లేకుండా రిస్క్ చేస్తున్నారట. సినిమాలో నాచురాలిటీ మిస్ అవ్వకుండా ఉండేందుకు ఈ విధంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఈ ఫైట్ సీన్ సినిమాలో మేజర్ హైలెట్గా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వికపుర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వీరితోపాటు ఎంతో మంది ప్రముఖులు కీలకపాత్రలో కనిపించనున్నారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ మరియు యువ సుధా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని సినీ బృందం అనుకుంటుందట. మరి ఈ సినిమా ఎన్టీఆర్ కు ఎలాంటి ఫేమ్ ను అందిస్తుందో వేచి చూడాలి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More