Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి అంటే తెలియని వారే ఉండరు కాబోలు. ఇటీవల ఈయన టాప్ 100 వరల్డ్ ఇన్ ప్లూయేన్సియల్ పీపుల్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే ఇటీవల రాజమౌళి కి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా రాజమౌళి మరియు ఆయన భార్య రమ రాజమౌళి లవ్ స్టోరీ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అయితే రమ రాజమౌళి ప్రస్తుతం రాజమౌళి సినిమాల్లోనే కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
అంతేకాక రాజమౌళి తన కెరీర్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు దాదాపుగా అన్ని సినిమాలకు రమానే కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తూ వస్తుంది. అలాగే వీరిద్దరిని ఇండస్ట్రీలో ఆదర్శ దంపతులుగా అందరు భావిస్తుంటారు. కానీ వీరి ప్రేమ ఎలా ప్రారంభమైంది పెళ్లికి ఎలా దారి తీసింది అనే విషయాలు మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. అయితే అవి ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రాజమౌళిని పెళ్లి చేసుకోవడం కంటే ముందే రమా కు వేరే వ్యక్తితో పెళ్లి జరిగిందట. వారి దాంపత్యంలో వారికి కార్తికేయ జన్మించాడు. ఆ తర్వాత కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో రమా కుమారుడుతో వేరుగా ఉండడం ప్రారంభించిందట.
అయితే కీరవాణి రాజమౌళి అన్నదమ్ముల కుమారులు. అలాగే రాజమౌళి ప్రతి సినిమాలో కీరవాణి సంగీతం అందిస్తాడు. అయితే కీరవాణి భార్య వల్లి రమా కు సోదరి. ఈ క్రమంలో రాజమౌళికి రమాకు పరిచయం ఏర్పడింది. అదే సమయంలో రాజమౌళి శాంతి నివాసం అనే సీరియల్ కు దర్శకత్వం వహించే అవకాశాన్ని అందుకున్నాడు. ఇంకా ఆ తర్వాత వీరిద్దరి పరిచయం, స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం సమయానికి ప్రేమగా మారింది. అయితే అప్పటికి రామాకు పెళ్లి అయింది, కుమారుడు కూడా ఉన్నాడని విషయం తెలుసుకున్న రాజమౌళి ఏ మాత్రం ఆలోచించకుండా రమాను పెళ్లి చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు.
పెద్దలను ఒప్పించి హడావిడి పెళ్లి చేసుకోకుండా చాలా సాధారణంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా కార్తికేయను రాజమౌళి తన సొంత కుమారుడు కంటే ఎక్కువగా చూసుకుంటూ వస్తున్నారు. ఒకవేళ తమకు సంతానం కలిగితే కార్తికేయ పై ప్రేమ తగ్గే అవకాశం ఉందని ఉద్దేశంతో రాజమౌళి రమాతో సంతానాన్ని కోరుకోలేదట. దానికి బదులుగా రాజమౌళి ఓ అమ్మాయి ని దత్తత తీసుకొని పెంచుకుంటూ వస్తున్నారు. ఇదండీ రాజమౌళి రమ లవ్ స్టోరీ..ఎంతైనా రాజమౌళి గ్రేట్ కదా..తన పిల్లలు కానప్పుడుకి తన పిల్లల కంటే ఎక్కువగా వారిని చూసుకుంటూన్నారు. మరి వీరి లవ్ స్టోరీ విన్నాక మీకు ఏమనిపించిందో కామెంట్స్ చేయండి.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More