Trisha : సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రిష గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన త్రిష ప్రస్తుత కాలంలో కోలీవుడ్ కే పరిమితమైంది. ఇక నాలుగు పదుల వయసులో కూడా పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ సింగిల్ గానే లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. అయితే త్రిష ఇంతకుముందే చాలామంది హీరోలతో ప్రేమలో పడి బ్రేకప్ చేసుకుంది. అంతేకాక త్రిష సినీ పరంగా కాకుండా ఎప్పుడు వ్యక్తిగత విషయాల పరంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఇక త్రిష బాయ్ ఫ్రెండ్ లిస్టు చూస్తే మామూలుగా ఉండదు.
ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ , మహేష్ బాబు, శింబు, రాణా, విజయ్ వంటి స్టార్ హీరోలతో ప్రేమాయణం నడిపించినట్లు సమాచారం. ఆ తర్వాత త్రిష బిజినెస్ మాన్ వరుణ్ మానియన్ తో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. అయితే ఏమైందో తెలియదు కానీ వీరిద్దరి మధ్య దూరం పెరిగి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే వీరు పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి గల ముఖ్య కారణం రజనీకాంత్ అల్లుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అని సమాచారం. అయితే త్రిష పెళ్లి ఆగటానికి ధనుష్ ఎలా కారణం అయ్యాడంటే… త్రిష తన ఎంగేజ్ మెంట్ కు తెలుగు మరియు తమిళ్ ఇండస్ట్రీ నుండి చాలామంది సెలబ్రిటీలను ఆహ్వానించిందట.
దానిలో భాగంగా ధనుష్ ని కూడా త్రిష ఆహ్వానించడం జరిగింది. కానీ ధనుష్ వారి ఎంగేజ్మెంట్ కు రావడం త్రిష కి కాబోయే భర్త వరుణ్ కు అసలు ఇష్టం లేదట. ఎందుకంటే వారిద్దరికీ అంతకుముందే కొన్ని గొడవలు ఉన్నాయట. దీంతో నాకు ఇష్టం లేని వ్యక్తిని మన ఎంగేజ్మెంట్ కి ఎలా రమ్మన్నావు అని ఎంగేజ్మెంట్ పూర్తి అయిన తర్వాత వరుణ్, త్రిషతో గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేశాడట. ఇక ఈ విషయంలో గొడవలు ముదిరి పెద్దవి కావడంతో ,పెళ్లి తర్వాత కూడా ఇలాగే చేస్తాడేమో అని త్రిష వరుణ్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకుందట. నిజంగా వీరి పెళ్లి ఆగడానికి ఇదే కారణం అని ఎవరు స్పష్టం చేయలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇదే కారణం అని వార్తలు వినిపిస్తున్నాయి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More