Kollywood actress : తమిళ్ ఇండస్ట్రీలో నిర్మాత మరియు లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత అయిన రవీందర్ చంద్రశేఖర్ మరియు నటీ మహాలక్ష్మి పెళ్లి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకోవడంతో ఈ జంట ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. అయితే వీరు ఇంత పాపులర్ అవ్వడానికి గల కారణం రవీందర్ అధిక బరువు ఉండడమే. కానీ రవీందర్ ను పెళ్లి చేసుకున్న మహాలక్ష్మి మాత్రం పొట్టిగా, సన్నగా నాజూకుగా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే మహాలక్ష్మి అతనిని పెళ్లి చేసుకుందంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇక ఆ సందర్భంలో వీరిద్దరి ఫోటోలు ప్రతిచోట మీమ్స్ లో దర్శనమిచ్చేవి. అంతేకాక రవీందర్ భారీ ఖాయం చూసి చాలామంది అతనిని బాడీ షేవింగ్ కూడా చేశారు.
ఇక ఇప్పుడు వారి పెళ్లి జరిగి రెండేళ్లు దాటింది. అయినా కూడా ఇప్పటికీ వీరిద్దరిపై ఏదో ఒక రకంగా ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఈ జర్నీలో వీరిద్దరూ ఒకసారి ఏకంగా విడాకులు తీసుకుంటున్నప్పుడు కూడా వార్తలు ప్రచారం జరిగాయి. అంతేకాక వీరి పెళ్లి జరిగి రెండేళ్లు అవుతున్న ఇంకా ఎందుకు మహాలక్ష్మి తల్లి కాలేదని పలువురు పలు రకాలుగా ఈ జంటపై కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎవరేమన్నా సరే అవేవీ మమ్మల్ని బాధించవని, తాము ప్రేమించి పెళ్లి చేసుకుంన్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉన్నామని ఈ జంట బహిరంగంగా నే చెప్పుకుంటూ వస్తున్నారుఇదిలా ఉంటే ఇటీవల రవీందర్ పుట్టినరోజు కావడంతో తన భర్తకు మహాలక్ష్మి ఆరడుగుల ప్రత్యేక బహుమతిని ఇచ్చి ఆశ్చర్యపరిచింది.
ఇక దీనికి సంబంధించిన వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా , ఆ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక ఆ ప్రత్యేకమైన బహుమతి ఏంటంటే.. 6 అడవులల ఎత్తు గల రవీందర్ ఫోటోను చక్కటి పెయింటింగ్ తయారు చేయించి పుట్టినరోజుకు కానుకగా ఇచ్చింది. అంతేకాక తన భర్తకు మహాలక్ష్మి బర్త్‌డే విషెస్ చెబుతూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఇలా రాస్కొచ్చింది . జీవితంలో మరలా నాకు ధైర్యం ఇచ్చిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు… మీరే నా బలం బలగం… ఎప్పటికీ నేను మీకు కృతజ్ఞురాలిని అని చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో పై నేటిజనులు లైక్స్ కొట్టడంతో పాటు పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. పలువురు రవీందర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి కొందరు ప్రేమకు అందంతో పనిలేదని ఈ జంట నిరూపించిందని కామెంట్స్ చేస్తున్నారు.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More