Tamannaah : ఎట్టకేలకు స్పందించిన తమన్నా భాటియా….బోల్డ్ సీన్స్ చేయడానికి గల కారణం ఇదే అంటూ….

Tamannaah  : లస్ట్ స్టోరీస్ 2 మరియు జి కర్ధా వంటి వెబ్ సిరీస్ కారణంగా హీరోయిన్ తమన్నా భాటియా సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. దీనికి గల కారణం ఆయా వెబ్ సిరీస్ లో ఆమె నటించిన బోల్డ్ సీన్స్ కారణమని చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ తమన్న ఎప్పుడు తన హద్దులను దాటలేదు. నో కిస్ పాలసీ ను ఫాలో అవుతూ వచ్చింది కానీ ఈసారి ఈ వెబ్ సిరీస్ లలో ఎవరు ఊహించిన విధంగా బోల్డ్ సీన్స్ లో నటించి ఆశ్చర్యానికి గురిచేసింది తమన్నా . అయితే ఇలా వస్తున్న విమర్శలపై తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తమన్న మాట్లాడారు. హీరోలు బోల్డ్ సన్నివేశాలు చేస్తే ఎవ్వరు విమర్శించరు కానీ హీరోయిన్స్ చేస్తే మాత్రం ఇంతటి వ్యతిరేకత ,ఎందుకంటూ ప్రశ్నించింది.

 

హీరోలు చేస్తే ఏం కాదు కానీ మేము చేస్తే ఎందుకు ఇంతటి వ్యతిరేకత వస్తుందో అర్థం కావడం లేదని తమన్నా చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్న యుగంలో ఇలాంటి వ్యతిరేకత వస్తుందని నేను అసలు ఊహించలేదు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని కొందరు ఇలాంటి విమర్శలు చేయడం చూస్తుంటే వింతగా ఉందని తమన్నా చెప్పుకొచ్చింది. నేను నా చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టా…కెరీర్ మొదటి దశ నుంచి , గ్లామర్ పాత్రలు చేస్తూనే ఉన్నా , అంతేకానీ మొదట్లో డి గ్లామర్ రోల్స్ చేసి , ఇప్పుడు సడన్ గా ఇలాంటి ప్రాజెక్టులలోకి అయితే అడుగు పెట్టలేదు అని తమన్నా తెలియజేశారు.

అలాగే ఇలాంటి సీన్స్ లో యాక్ట్ చేస్తే పర్సనల్ ఎటాక్ ఎందుకు పాల్పడుతున్నారు నాకు అసలు అర్థం కావడం లేదని తమన్నా చెప్పుకొచ్చారు. ఇలాంటి సన్నివేశాలను స్టార్ హీరోలు సూపర్ స్టార్స్ తరచూ చేస్తూనే ఉంటారు. మరి వారిని ఎవరు విమర్శించరు ఎందుకు అంటూ ప్రశ్నించింది. అలాగే ఈ 18 ఏళ్ల కెరియర్లో కొన్ని రూల్స్ పాటించాను. నో కిస్ పాలసీ నా కాంట్రాక్ట్ లో ఉంది కానీ కెరియర్ పరంగా పైకి రావాలంటే మారుతున్న ఆధునిక కాలంతోపాటు మనం కూడా మారాలని అందుకే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఇలాంటివి చేశానని తమన్నా వివరించారు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More