Digital Beggar : ప్రతిరోజు మనం ఎక్కడో ఒకచోట బిక్షగాలను చూస్తూనే ఉంటాం. వాళ్లు డబ్బులు అడిగితే కొందరు ఇస్తారు, మరికొందరు చిల్లర లేదంటూ వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ కారణంగా ప్రతి ఒక్కరు డిజిటల్ మనీ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. తద్వారా ఎవరు తమ వద్ద డబ్బులను ఉంచుకోవడం లేదు. ఎక్కడకు వెళ్లిన డిజిటల్ మనీ అందుబాటులో ఉండడంతో ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించే అమ్మకాలు విక్రయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బెగ్గర్స్ ఎవరిని అడిగినా చిల్లర లేదని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ పిచ్చగాడి దగ్గర మాత్రం ఇలాంటి సాకులు కుదరవు. ఎందుకంటేఆ బిచ్చగాడు కూడా డిజిటల్ బాటను ఎంచుకున్నాడు.
ప్రస్తుతం ఈ బిచ్చగాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బిచ్చగాడు తెలివి చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇక ఈ వీడియోను @jaggiram అనే ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ ఘటన ముంబై లోకల్ ట్రైన్ లో చోటుచేసుకుంది. ప్రయాణికులతో బాగా రద్దీగా ఉన్న ముంబై లోకల్ ట్రైన్ కోచ్ లోకి ఓ బిచ్చగాడు పాటలు పాడుకుంటూ ప్రవేశించాడు. అయితే ఆ బిచ్చగాడి చేతిలో క్యూఆర్ కోడ్ కూడా ఉంది. పాటలు పాడుకుంటూ చిల్లర లేకపోతే ఫోన్ పే చేయండి అంటూ అందర్నీ అడుగుతున్నాడు.
ఇది గమనించిన చుట్టుప్రక్కల ప్రయాణికులు బిక్షగాడిని చూసి ఆశ్చర్యపోయారు. ఈ బెగ్గర్ దగ్గర ఎలాంటి సాకులు చెప్పడం కుదరవేమో అంటూ నవ్వుకుంటున్నారు. అయితే అక్కడ ఉన్న వారిలో ఒకరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియా లో షేర్ చేయగా , ఈ వీడియో కాస్త వైరల్ గా అవుతుంది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజనులు బెగ్గర్స్ కూడా డిజిటల్ బాట పట్టారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు చిల్లర లేదని చెప్పడం కుదరదు డిజిటల్ బెగ్గర్స్ వచ్చేసారంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More