RRR movie wins international award : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తూ పోతుంది. ఇప్పటికే ఇండియాలో వసూళ్ల పరంగా భారీ కలెక్షన్స్ రాబట్టిన ఆర్ఆర్ఆర్ సినిమా విదేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకుంటుంది. పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శిస్తూ అవార్డులను గెలుచుకుంటుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ వేదిక మీద అరుదైన అవార్డును సొంతం చేసుకుంది.అరుదైన అవార్డు దక్కించుకుంది. సుమారు ఆరున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు బెస్ట్ నాన్ – ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయింది.
అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నాటు నాటు నాటు పాటకు నామినేషన్ దక్కింది. ఈ పాటకు సంగీత దర్శకత్వం వహించిన ఎంఎం కీరవాణి, ఈ పాటను రాసిన చంద్రబోస్ లకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకుంది. బుధవారం ఉదయం ప్రారంభమైన అవార్డుల కార్యక్రమంలో నాటు నాటు పాటకు ఎం ఎం కీరవాణి అవార్డు అందుకున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తొలి భారతీయ సినిమాగా ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డ్స్ సృష్టించింది.
ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కలిసి పాడారు. దీనికి కీరవాణి మ్యూజిక్ అందించారు చంద్రబోస్ రచించారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకకు ఎన్టీఆర్, రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సతీ సమేతంగా హాజరయ్యారు. వీళ్లతో పాటు బాహుబలి సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ కూడా పాల్గొన్నారు. ఇక రెడ్ కార్పెట్ మీద ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ అందరిని ఆకర్షించింది. అంతర్జాతీయ వేదిక మీద భారతీయ సాంప్రదాయాన్ని చూపించి సందడి చేశారు.
Must Read : Actress Pragathi : పట్టపగలే మందు కొడుతూ అడ్డంగా దొరికిపోయిన నటి ప్రగతి .. పిక్స్ వైరల్ ..
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More