Double-Ismart : ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన బోతున్న డబల్ ఇస్మార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ ను అందుకోవడంతో దానికి సిక్వెల్ గా ఇన్నాళ్ల తర్వాత డబల్ ఇస్మార్ట్ ను తెరపై తీసుకొస్తున్నారు. ఇక ఈ సినిమాలో తన పాత్ర కోసం రామ్ సరికొత్త లుక్ లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా ప్రాజెక్టునుపూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ మరియు హీరోయిన్ ఛార్మి నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవల ముంబైలో ప్రారంభం అవ్వడంతో ఈ సినిమాపై మరింత ఉత్కంఠత నెలకొంది. ఈ సీక్వెన్స్ కోసం స్టంట్ మాస్టర్ కేచార రంగంలోకి దిగారు. ఈయన ఇంతకుముందే పూరి జగన్నాథ్ తో కలిసి ” ఇద్దరమ్మాయిలతో ” సినిమాకు వర్క్ చేశాడు. అంతేకాక ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేయడానికి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానిల్లి ను పూరి జగన్నాథ్ ఎంచుకున్నాడు. అంతేకాక ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులను మరియు మిగతా సిబ్బంది వివరాలను తెలియజేసేందుకు మేకర్స్ సన్నద్ధమవుతున్నారు.
డబల్ ఇస్మార్ట్ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదలల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను అంచనాలకు మించేలా చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో పెద్ద ఎత్తున విడుదల చేయాలని సినీ బృందం అనుకుంటున్నారు. ఈ సినిమా తప్పకుండా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుందని నీ బృందం తెలియజేస్తున్నారు. అయితే ఈ సినిమా మహాశివరాత్రి శుభ సందర్భంగా 2024 మార్చి 8న విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ తో వస్తున్న ఈ సినిమా డబల్ ఇస్మార్ట్ లెవెల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాలి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More