Tollywood : ఇటీవల దసరా ‘ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న న్యాచురల్ స్టార్ నాని త్వరలోనే ‘ హాయ్ నాన్న ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాను శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మృనాల్ ఠాకూర్ నటిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్ తో పాటు టీజర్ ను కూడా విడుదల చేశారు. అయితే నాని ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. నాన్న అని పిలిచేది ఈ పోస్టర్లో ఉన్న చిట్టితల్లి కాదని, పక్కనే ఉన్న అందమైన అమ్మాయి అని హింట్ ఇచ్చారు. అంటే పాప తల్లి వేరు, ఆమె దూరం అయ్యాక వచ్చిన అమ్మాయే మృణాల్ ఠాకూర్ అని క్లారిటీ ఇచ్చారు.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల కాబోతుంది. దసరా సినిమాతో ప్రేక్షకులకు కొత్తగా కనిపించిన నాని ఈసారి నాన్న పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాడు. జెర్సీ సినిమాలో పదేళ్ల కుర్రాడికి తండ్రి లాగా నటించి ఎమోషనల్ గా ప్రేక్షకులను కట్టి పడేసిన నాని ఈసారి నాన్న పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఇకపోతే ఖుషి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వబోతున్న హేశం అబ్దుల్ వహాబ్ దీనికి సంగీతం సమకూరుస్తున్నాడు.
ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న నానికి ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ‘ సీతారామం ‘ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ కు మరోసారి భావోద్వేగాలు నిండిన పాత్ర దొరికింది. ఈ సినిమాతో ఈ బ్యూటీ ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఏది ఏమైనా న్యాచురల్ స్టార్ నాని మాత్రం ఒక్కో సినిమాకి ఒక్కో వేరియేషన్ చూపిస్తూ వస్తున్నారు. దసరా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకున్న నాని ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More