Naresh – Pavitri Lokesh : సెకండ్ ఇన్నింగ్స్ తో తెరపైకి రానున్న నరేష్ – పవిత్ర లోకేష్..వారి నిజ జీవితమే సినిమాగా..

Naresh – Pavitri Lokesh : సీనియర్ నటుడు నరేష్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరూ సహజీవనం సాగిస్తున్నారు అన్న విషయం కూడా అందరికీ తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు అంటూ ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేసింది. కొన్ని గంటలపాటు ఆ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అయితే ఆ పెళ్లి వీడియో సినిమా కోసం చేసిందని నిజం కాదని మీరిద్దరి వివాహానికి ఇంకా టైం ఉందని తర్వాత వెళ్లడయింది. అయితే నరేష్ మరియు పవిత్ర లోకేష్ ఇప్పుడు “సెకండ్ ఇన్నింగ్స్” అనే సినిమాలో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా విడాకులు తీసుకున్న ఓ జంట కొత్త జీవితాన్ని మొదలు పెడితే ఏర్పడే అవాంతరాలు , ఆ తర్వాత ఎదుర్కొనే సమస్యలపై సెకండ్ ఇన్నింగ్స్ అనే సినిమాను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సెకండ్ ఇన్నింగ్స్ సినిమాను ప్రముఖ దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కథ కొంచెం నరేష్ – పవిత్ర లోకేష్ రియల్ లైఫ్ ను పోలి ఉంటుందని అందుకే ఈ సినిమాలో వీరు ఇద్దరిని ,పెట్టినట్లు సమాచారం. విడాకులు తీసుకున్న జంట రెండవ పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత జరగబోయే పరిణామాలను ఎదుర్కోబోయే సమస్యలను సెకండ్ ఇన్నింగ్స్ సినిమాలో చూపించాలని భావిస్తున్నారట.

ఆల్రెడీ పెళ్లి విడాకులు తీసుకున్న పెద్ద వయసు వారు మరల తోడు కోసం మరో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయి వారి పిల్లల నుండి మరియు సమాజం నుండి ప్రతికూలత ఎలా ఉంటుంది ఇలా ప్రతి ఒక్క అంశంపై ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అంతేకాక ఈ సినిమాను నరేష్ స్వయంగా నిర్మిస్తున్నట్లు, ఈ సినిమాతో వారి యొక్క బంధాన్ని మరింత పెంచుకోవడంతో పాటు నేటి జనులకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎవరు అడ్డు వచ్చినా సరే తాము కలిసి జీవించాలని భావిస్తున్నాం కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని ఈ సినిమా ద్వారా సందేశాన్ని ఇవ్వబోతున్నారట. దీంతో పవిత్ర లోకేష్ నరేష్ చేయబోయే సెకండ్ ఇన్నింగ్స్ భారీ ఎత్తున వైరల్ అయింది.

Naresh – Pavitri Lokesh who will come to the screen with the second innings.. their real life as a movie..

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More