Mohan Babu : విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు పుట్టిన రోజుని ఈ ఆదివారం రోజున కుటుంబ సభ్యులు జరుపుకున్నారు. మార్చి 19న మోహన్ బాబు పుట్టినరోజు కాగా ఆదివారంతో ఆయన 71వ సంవత్సరంలోకిి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా మంచు కుటుంబ సభ్యులు మోహన్ బాబు పుట్టిన రోజుని జరుపుకున్నారు. అయితే ఈ వేడుకలో కొత్త కోడలు మంచు మనోజ్ భార్య భూమా మౌనిక దగ్గర ఉండి ఈ వేడుకుని చేసినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ లో సందడి మొత్తం మౌనికదే అని సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకి వచ్చాయి.
ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరూ కలిసి గుడి కి వెళ్లి ప్రత్యేక పూజలు చేసినట్లు సమాచారం. ఈ వేడుకల్లో మోహన్ బాబుతో పాటు భార్య నిర్మల దేవి, కూతురు లక్ష్మీ మంచు, మనవరాలు మరియు కొడుకు మనోజ్ , కోడలు మౌనిక కనిపిస్తున్నారు. అయితే ఈ వేడుకల్లో మంచు విష్ణు ఆయన ఫ్యామిలీ కనిపించకపోవడం గమనార్హం. మోహన్ బాబు బర్త్‌డే సెలబ్రేషన్స్ లోని ఫోటోలను మంచు లక్ష్మి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి షేర్ చేయడంతో ఈ ఫొటోస్ కాస్త వైరల్ గా మారాయి. దీంతో నేటి జనులంతా మంచు విష్ణు ఎక్కడ అంటూ ప్రశ్నించడం మొదలెట్టారు.
ఇది ఇలా ఉంటే తండ్రి పుట్టిన రోజు సందర్భంగా మనోజ్ ఎమోషనల్ అయిన పోస్ట్ ను షేర్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. నడక నుండి నా నడవడిక వరకు నన్ను నడిపించిన నాన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాన్న లవ్ యు అంటూ మనోజ్ విషెస్ తెలియజేశారు. అలాగే కూతురు మంచు లక్ష్మి మంచు విష్ణు మరియు మనవరాలు మనవళ్ళు అందరూ సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More