“Malli Pelli” OTT Streaming : తెలుగు సినీ ఇండస్ట్రీలో వివాదాల జంటగా వేరు పొందిన నరేష్ పవిత్ర లోకేష్ ఇటీవల మళ్ళీ పెళ్లి అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇక ఈ సినిమా మే 26న విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాను నరేష్ పవిత్రల నిజ జీవితాల్లో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఇక ఈ సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ప్రేక్షకులను మెప్పించి థియేటర్లో మంచి వసూలను రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు సినీ బృందం చర్యలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ ను కొన్ని రోజుల ముందే తెలియజేశారు. దీంతో శుక్రవారం రోజున ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థలు అయిన అమెజాన్ ప్రైమ్ మరియు ఆహా లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ ఆగిపోయింది.. నరేష్ మూడో భార్య అయిన రమ్య రఘుపతి “మళ్లీ పెళ్లి” సినిమా ఓటిటి రిలీజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ అవ్వకుండా అడ్డుకునేందుకు ఏకంగా కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఆమె కోర్టులో కేసును నమోదు చేసింది. ఈ సినిమాలోని పాత్రలు తమ జీవితాలకు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయని పిటీషన్ లో పేర్కొంది.
అంతేకాక సినిమాలోని సౌమ్య సేతుపతి అనే పాత్ర తనను కించపరిచేలా ఉందని , దీని కారణంగా ఈ సినిమాను ఓటీటీ లో స్ట్రీమింగ్ అవకుండా చూడాలని కోరింది. అనంతరం కోర్టు నుండి అమెజాన్ ప్రైమ్ కు మరియు ఆహా సంస్థలకు రమ్య లీగల్ నోటీసులను పంపిందట. దీంతో ఓటీటీ సంస్థలు మళ్లీ పెళ్లి సినిమా స్ట్రీమింగ్ విషయంలో వెనుకడుగు వేశాయి. అయితే శుక్రవారం ప్రారంభం కావాల్సిన ఈ సినిమా స్ట్రీమింగ్ ఇప్పటికే ఆగిపోయింది. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More