Malli Pelli : ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ సిని జంట మరియు నిత్యం వార్తలో నిలుస్తున్న అంశం ఏదైనా ఉందా అంటే నరేష్ పవిత్ర లోకేష్ జంట మరియు వారు చేస్తున్న సినిమా అనే చెప్పాలి. అంతేకాదు కరోనా తర్వాత మోస్ట్ ఎంటర్టైనింగ్ న్యూస్ ఏదైనా ఉందా అంటే వీరిద్దరి ప్రేమ వ్యవహారమే . అంతేకాక ఎప్పుడైతే వీరు వివాహం చేసుకోబోతున్నామని ప్రకటించారో ఆనాటి నుండి వీరి ప్రేమ కథ చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారాయి. ఇక ఇప్పుడు ఎక్కంగా వీరి రియల్ స్టోరీ ని మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ సినిమాలోని ఒక్కొక్క పాటను విడుదల చేస్తూ వస్తున్నారు.
వీరిద్దరూ జంటగా నటించిన మళ్లీ పెళ్లి టీజర్ ఈ మధ్యనే విడుదలై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. వీరి నిజ జీవితంలో ఏర్పడిన అడ్డంకులు, సన్నివేశాలు ఈ సినిమాలో కనిపించడం గమనార్హం. అయితే ఈ ట్రీజర్ ను ట్రోలర్స్ మాత్రం బాగా ఉపయోగించుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ మూవీ అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వాడేద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుండి మరో సాంగ్ రిలీజ్ అయింది. రారా హోసూరు నాతో… అనే రొమాంటిక్ సాంగ్ ను మూవీ మేకర్స్ ఇటీవల రిలీజ్ చేశారు.
అయితే ఈ సాంగ్ లో నరేష్ పవిత్రులతో పాటు మరో జంట కూడా కనిపించింది. అందరూ అనుకున్నట్టు అలాంటి సన్నివేశాలు లేనప్పటికీ… లిరిక్స్ మాత్రం బాగున్నాయి. అయితే ఇప్పటికే ఈ పాటను చూసిన వారంతా సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక ఈ సినిమాని మెగా మూవీ మేకర్స్ డైరెక్టర్ ఎమ్మెస్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కుటుంబ సమేతంగా కూడా చూడవచ్చట. అయితే కుర్రకారులకు మాత్రం ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుందని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో వేచి చూడాలి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More