Anasuya Bharadwaj : జబర్దస్త్ షో తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది అనసూయ. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో ప్రస్తుతం సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది. ఇకపోతే అనసూయ సినిమాలపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులను అలరిస్తుంటుంది. అలాగే విపరీతమైన ట్రోలింగ్ కి కూడా గురవుతూ ఉంటుంది. ఇక అనసూయకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు ట్విట్టర్ వేదికగా సాగే వార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ టైంలో వీరి మధ్య వివాదం స్టార్ట్ అయింది. అప్పటినుంచి అది పెరుగుతూనే వస్తుంది. ఆ తర్వాత లైగర్ సినిమా ఫ్లాప్ అయిన సమయంలో అనసూయ కర్మ ఫలితం అంటూ ట్వీట్ చేసింది. దీంతో రౌడీ ఫాన్స్ ఆంటీ అంటూ కామెంట్స్ చేయడం,
ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసే వరకు సాగింది. ఇక తాజాగా మరోసారి విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ అనసూయ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మనకు తెలిసిందే విజయ్ దేవరకొండ శివనిర్వాణ దర్శకత్వంలో ‘ ఖుషి ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. ఈ సినిమా రిలీజ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసి ప్రమోషన్స్ ని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ పేరు ముందు ది విజయ్ దేవరకొండ అని ఉంది. ఇంగ్లీష్ గ్రామర్ పరంగా ది అనే పదాన్ని యూనిక్ విషయాలకు వస్తువులకు మాత్రమే వాడుతుంటారు.
అంటే విజయ్ దేవరకొండ యూనిక్ అనే అర్థం వచ్చేలా ఇలా పేరు ముందు దీ పదాన్ని యాడ్ చేశారని అభిమానులు భావిస్తున్నారు. దీనిపై కొందరు విజయ్ దేవరకొండ మీద విమర్శలు చేస్తున్నారు. అతను అతి చేస్తున్నాడని, అమితాబచ్చన్ చిరంజీవి రజినీకాంత్ లాంటి వాళ్లే ఎప్పుడు ఇలాంటి పదాలు వాడుకోలేదు. కానీ ఇతడు మాత్రం నాలుగైదు సినిమాలకే ఇలాంటి పేర్లు పెట్టుకోవడం ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనసూయ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడే ఒకటి చూశాను. ‘ ది ‘ నా బాబోయ్ పైత్యం .. ఏం చేస్తాం, అంటకుండా చూసుకుందాం అంటూ ట్వీట్ చేసింది. అంటే ఆమె డైరెక్ట్ గా విజయ్ దేవరకొండ గురించి ప్రస్తావించిందని అభిమానులు అనసూయ పై ఫుల్ ఫైర్ అవుతున్నారు.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More