Krithi Shetty : ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కృతి శెట్టి. ఇది తన మొదటి సినిమా అయినప్పటికీ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. అంతేకాక ఆ సమయంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కృతి ఫొటోస్ , వీడియోస్ దర్శనమిచ్చేవి. అంతలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ ముద్దుగుమ్మకు దాదాపుగా 5.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
అయితే ఉప్పేన సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన రెండు సినిమాలు కుడా బ్లాక్ బాస్టర్ అవడంతో తెలుగు ఇండస్ట్రీని ఏలుతుందని అందరూ భావించారు. కానీ దానికి భిన్నంగా ఆ తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఈమెను ఐరన్ లెగ్ హీరోయిన్ గా మార్చేసాయి. అయితే ఇటీవల నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమాతో కొంత ఊరట లభించిందని చెప్పాలి. అయితే రీసెంట్ గా కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కృతి శెట్టి తనకు కాబోయే భర్త గురించి కొన్ని విషయాలను మీడియాతో పంచుకుంది.
నన్ను చేసుకోబోయే వాడికి అందం లేకపోయినా పర్లేదు,ఆస్తి లేకపోయినా పర్లేదు కానీ బొద్దుగా ఉండి , చబ్బీ చబ్బీగా బుగ్గలు పెద్దగా ఉండాలని అంటుంది. అలా ఉంటే కృతికి చాలా ఇష్టమట. అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోయినా మంచి మనసుంటే చాలని కృతి తన మనసులోని మాటను బయటకు వ్యక్తం చేసింది. దీంతో ఈ కన్నడ బ్యూటీ తనకు కాబోయే వాడి గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో కృతి శెట్టి పేరు మరల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More