Keerthy Suresh : దసరా సినిమా చేశాక .. ఆ స్టార్ హీరో పై మనసు పడ్డ కీర్తి సురేష్ ..

Keerthy Suresh : టాలీవుడ్ లో రామ్ హీరోగా నటించిన ‘ నేను శైలజ ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అందాల భామ కీర్తి సురేష్. తన అందం, నటనతో మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఆమెకు వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి. అయితే అన్ని సినిమాల కన్నా ‘ మహానటి ‘ సినిమా కీర్తి సురేష్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమాలో అచ్చం సావిత్రి లాగా నటించి నేషనల్ అవార్డును అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది కానీ అవి అంతగా సక్సెస్ కాలేదు. అయితే తాజాగా కీర్తి సురేష్ నాచురల్ స్టార్ నాని ‘ దసరా ‘ సినిమాలో హీరోయిన్గా నటించింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న విడుదల కాబోతుంది.

ఈ సినిమా ట్రైలర్ లో కీర్తి సురేష్ చాలా న్యాచురల్ గా కనిపించారు. ఇక నాని అయితే చెప్పనక్కర్లేదు. పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించాడు అనిపిస్తుంది. ‘ దసరా ‘ సినిమా హిట్ అయితే కీర్తి సురేష్ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంటుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది. తాజాగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కీర్తి సురేష్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో మీరు నటిస్తారా అని యాంకర్ కీర్తి సురేష్ ని అడుగుతుంది. దీనికి బదులుగా ఆమె నాకు కూడా నటించాలని ఉంది అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తనకు షారుక్ ఖాన్ అంటే చాలా ఇష్టమని, ఆయనతో నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోను అని చెప్పుకొచ్చారు.

keerthy-suresh-fall-in-love-with-the-star-hero-after-making-dussehra-movie

పాన్ ఇండియా సినిమా అయిన దసరా సినిమాలో నటించాక కీర్తి సురేష్ బాలీవుడ్లో నటించాలనే కోరిక పుట్టిందనో నెటిజన్స్ భావిస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ మీద కాకుండా ఏకంగా షారుక్ ఖాన్ పై మనసు పడిందంటూ కామెంట్లు చేస్తున్నారు. షారుక్ ఖాన్ పక్కన నటించడం అంటే ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయినట్లే. దీంతో కీర్తి సురేష్ చాలా తెలివైనది అంటూ జనాలు మాట్లాడుకొస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాలో నాని, కీర్తి సురేష్ మేకప్ లేకుండా నటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 30న థియేటర్స్ లలో విడుదల కాబోతుంది. మరి ఈ సినిమా ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం కీర్తి సురేష్, నాని పాన్ ఇండియా స్టార్స్ అయిపోతారు.

 

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More