Tollywood : ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ హావా బాగా నడుస్తుంది. ఇక సీనియర్ హీరోయిన్స్ కుర్ర హీరోయిన్లకు గట్టిగానే పోటీ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ కొందరు మాత్రమే చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. అయితే పైన లేడి పిల్లల ఎగురుతూ కనిపిస్తున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా. తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని, రెండవ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. అంతేకాక ఆమె నటనతో సినీ విమర్శకులతో ప్రశంసలను అందుకుంది.
అంతేకాదు తన నటనతో జాతీయ స్థాయిలో అవార్డును అందుకొని అందరి చేత మహానటి అని పిలిపించుకుంది. ఇప్పటికే తన ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అవును ఆమె మహానటి కీర్తి సురేష్. రామ్ పోతినేని హీరోగా నటించిన “నేను శైలజ” అనే సినిమాతో ఈ ముద్దుగుమ్మ తేరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఆ తర్వాత మహానటి సావిత్రి గారి జీవిత చరిత్రలో సావిత్రి గారి పాత్రలో నటించి అలనాటి సావిత్రిని మైమరిపించింది.
ఇక ఈ సినిమా తర్వాత అంతటి మహానటి సావిత్రి గారి పేరును ఈ జనరేషన్ మహానటిగా అనిపించుకుంది. ఇటీవల నాచురల్ స్టార్ నానితో దసరా సినిమాలో నటించి మరో బ్లాక్ బాస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. దీని తర్వాత కీర్తి మెగాస్టార్ చిరంజీవి చెల్లి గా భోళా శంకర్ సినిమాలో నటించబోతుంది అని సమాచారం. ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తుంది. అయితే తాజాగా దసరా సినిమా చిత్రీకరణ సమయంలో కీర్తి సురేష్ చేసిన అల్లరి వీడియోను కీర్తి తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More