Uday Kiran : హీరో ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడేం చేస్తుందో తెలుసా..ఇలా తయారు అయ్యిందేంటి..

Uday Kiran : ఎలాంటి సపోర్ట్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకుని అప్పటి స్టార్ హీరోలకు సమానమైన హోదాను దక్కించుకున్న హీరో ఉదయ్ కిరణ్ మనందరికీ గుర్తుండే ఉంటారు. అప్పట్లో ఈయన తీసిన సినిమాలలో ఎక్కువ శాతం విజయం సాధించన సినిమాలే ఉన్నాయి. అలా విజయవంతంగా కెరియర్ దూసుకుపోతున్న టైంలో ఒక్కసారిగా ఆయనకు ప్లాప్స్ రావడం మొదలయ్యాయి. దీనివలన సినిమా అవకాశాలు కోల్పోయి, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికి ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం మనందరికీ తెలుసు. ఈ సంఘటనను మన తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు అనే చెప్పాలి.

do-you-know-what-hero-uday-kirans-wife-is-doing-now

 

అయితే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడానికి గల అసలు కారణం ఏంటి అనేది ఇప్పటికీ బయటపడలేదు. కానీ సోషల్ మీడియాలో ఈయన మరణం పై పలు రకాల కథనాలు ఇప్పటికి కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత ఆయన భార్య విషిత ఏమైంది…? ఎక్కడకు వెళ్ళింది…? మరో పెళ్లి చేసుకుందాం..? అసలేం చేస్తుంది అనే విషయాలు ఎవరికీ తెలియదు. అయితే ఉదయ్ కిరణ్ సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఉదయ్ కిరణ్ భార్య గురించి సేకరించిన కొన్ని విషయాలను ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాము.

do-you-know-what-hero-uday-kirans-wife-is-doing-now

అయితే విషిత ఉదయ్ కిరణ్ ని పెళ్లి చేసుకోక ముందే ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. అయితే వీరిద్దరూ ఓ ఫంక్షన్ లో కలుసుకుని పరిచయం ఏర్పడగా ఆ పరిచయం కాస్త ప్రేమగా మరి పెళ్లికి దారి తీసింది. ఇక ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత విశిత మరో పెళ్లి చేసుకోలేదట. అతని జ్ఞాపకాలతోనే కాలం గడిపేస్తూ ఉంటుందట. ఉదయ్ కిరణ్ జయంతికి ఆమె అనాధాశ్రమానికి వెళ్లి దానధర్మాలు వంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుందట. ఇప్పుడు కూడా ఆమె ఒక మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. నెలకు దాదాపుగా రెండు లక్షల పైనే శాలరీ ఉంటుందని అంచనా. అయితే ఆమెకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకపోవడంతో తల్లిదండ్రులతో కలిసి ప్రశాంతవంతమైన జీవితాన్ని గడుపుతుంది. ఎంత ప్రశాంతవంతమైన జీవితం గడిపినప్పటికీ ప్రేమించిన వాడు తన పక్కన లేకపోవడం కొంత ఆవేదన అనే చెప్పాలి.

 
ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More