Tammareddy : నీ అమ్మ మొగుడు మర్యాద నేర్పలేదా..నాగబాబుపై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Tammareddy : ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం దాదాపుగా 80 కోట్లు ఖర్చు పెట్టారని దాంతో ఎనిమిది సినిమాలు చేయవచ్చునంటూ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నేటిజన్స్ కామెంట్స్ రూపంలో రియాక్ట్ అయ్యారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు కూడా తమ్మారెడ్డి పై విరుచుకుపడ్డారు. తెలుగు సినీ ఇండస్ట్రీతో రిలేషన్ ఉన్న తమ్మారెడ్డిపై సినీ పెద్దలు రాఘవేంద్రరావు మరియు మెగా బ్రదర్ నాగబాబు ఆవేశం వ్యక్తం చేశారు. నాగబాబు అయితే నీ అమ్మ మొగుడు ఖర్చు పెట్టాడా 80 కోట్లు అంటూ ఘాటైన పదజాలంతో ట్విట్టర్లో ట్విట్ చేశాడు. తర్వాత రాజమౌళిని చూసి జెలసి ఫీల్ అవుతున్నావా అంటూ వీడియోని తీసి రిలీజ్ చేశాడు. ఇక ఈ వీడియో పై తమ్మారెడ్డి భరద్వాజ్ రియాక్ట్ అయ్యారు. అసలు విషయం తెలుసుకోకుండా ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని, అసలు వీడికి ఏమి లెక్కలు తెలుసు అని కొందరు అంటున్నారు.

దాని నేను పట్టించుకోను నేను ఇండస్ట్రీకి ఎప్పుడు రెస్పాన్సిబుల్ గానే ఉన్నానని చెప్పుకొచ్చారు. ఎవరో బయట వారు అంటే నేను పట్టించుకోను కానీ సిని ఇండస్ట్రీకి చెందిన సినీ పెద్దలు చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని ఆయన అన్నారు. నేనేం తప్పుగా మాట్లాడలేదు నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఆ రోజు మూడు గంటలు మాట్లాడానని చిన్న సినిమాల గురించి వివరించానని ఆయన తెలిపారు. సినిమా స్థాయిని బట్టి సినిమా బడ్జెట్ ను బట్టి సినిమా చేసుకోవాలని వివరించానని. ఆర్ ఆర్ ఆర్ గురించి రాజమౌళి గురించి అంతకు ముందే భారతదేశానికి గర్వకారణం రాజమౌళి అని హ్యాట్సాఫ్ అని చెప్పాను. అది ఎవరు గమనించలేదా. రాజమౌళిని చూసి నేను జెలిస్ ఫీల్ అవుతున్న అంటున్నారు. అసలు నేను ఆయనని చూసి జెలిస్ ఫీల్ అవడానికి ఆయన నా కాలానికి చెందిన దర్శకుడు కాదు, ఇంక నేను ఆయనతో సమానంగా సినిమాలు తీసే వాడినైతే కాదు నాకెందుకు జెలస్, నేనేదో కృష్ణా రామా అని బ్రతుకుతున్నాను.

కాని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకడైతే నీ అమ్మ మొగుడు అని అంటున్నాడు మా అమ్మ మొగుడు నాకు మర్యాద నేర్పాడు, నాకు సంస్కారం నేర్పించాడు. మీ అమ్మ మొగుడు నీకు నేర్పించలేదా. కుల మతాల గురించి మాట్లాడే మీరా నా గురించి మాట్లాడేది మీకు హక్కు ఉందా నన్ను అలా అనడానికి అంటూ ప్రశ్నించారు. ఆరోజు అన్ని గంటలు మేము మాట్లాడాము. అది మొత్తం చూసే ఓపిక మీకు లేదు. మూడు గంటలు ఎవడో ఎడిట్ చేసి పెట్టేస్తే దాన్ని చూసి మీరు అసలు విషయం తెలుసుకోకుండా తిట్టేస్తే అయిపోయిందా. అది చూడకుండా మీరు నన్ను తిట్టారు చూడండి మీకు సిగ్గుండాలి. నాకెందుకు సిగ్గు. నేనేం తప్పు చేయలేదు. నేను నోరు విప్పితే చాలా ఉంటాయి. కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ అంతా ఒకటే.మనమంతా ఒకటే అని నేను ఫీల్ అవుతున్నాను. నాకు మానం, అభిమానం ఉన్నాయి. మీ లాగా నేను సిగ్గు లేకుండా మాట్లాడలేను అంటూ తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More