Colours Swathi : తన సరదా మాటలతో ప్రేక్షకులను మెప్పించి బుల్లితెర నుండి వెండితెరపై అడుగుపెట్టింది కలర్స్ స్వాతి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘ ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ‘ అనే సినిమాలో హీరో వెంకటేష్ కు మరదలుగా నటించి మంచి గుర్తింపును సాధించింది. ఆ తర్వాత స్వామి రారా , కార్తికేయ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. అలాగే నాచురల్ స్టార్ నాని సరసన ” అష్టా చమ్మా ” సినిమాలో నటించి అద్భుతమైన నటనతో ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమాకు నంది అవార్డు కూడా లభించింది. అయితే తాజాగా స్వాతి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం జరుగుతుంది. స్వాతి కూడా సమంత నిహారిక లాగా విడాకులు తీసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
దీనికి గల కారణం స్వాతి తన భర్త ఫోటోలను ఇంస్టాగ్రామ్ నుంచి తొలగించడమేనట. దీంతో నిహారిక మాదిరిగానే స్వాతి కూడా విడాకులు తీసుకుపోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే స్వాతి విషయంలో ఇలాంటి ప్రచారం ఇంతకు ముందే జరిగింది. సుమారు రెండేళ్ల క్రితం స్వాతి పై ఇలాంటి వార్తలు ప్రచారం జరిగాయి. అయితే అలా వస్తున్న వార్తలకు స్వాతి స్పందించి …భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఆర్కివ్స్ లో దాచుకున్నానని తన ఫోన్లో ఉన్న ఫోటోలను చూపించింది. అంతేకాక తన భర్తకు సంబంధించిన ఓ చిన్న వీడియోను అప్పట్లో పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఆ సమయంలో తన విడాకులపై వచ్చిన వార్తలకు చెక్ పడింది స్వాతి . అయితే తాజాగా మరోసారి స్వాతీ విషయంలో ఇలాంటి ప్రచారమే వెలుగులోకి వచ్చింది.
2018లో మలయాళీ కుటుంబానికి చెందిన పైలెట్ వికాస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి , పెళ్లి అనంతరం థాయిలాండ్ లో సెటిల్ అయ్యారు. కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన స్వాతి 2019లో మలయాళం సినిమా త్రిశూరపురం లో నటించి రియంట్రి ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పంచతంత్రం తోపాటు మరో రెండు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు స్వాతి సినిమాలను చేసుకుంటూ హైదరాబాద్ లో ఉంటుండగా భర్త వికాస్ థాయిలాండ్ లో ఉంటున్నారట. వీరిద్దరి ఎడబాటు కూడా విడాకుల వార్తలకు బలాన్ని చేకూర్చాయి. ఇలా వస్తున్న వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే గతంలో మాదిరిగా స్వాతి స్పందిస్తే కానీ అర్థం కాదు. చూద్దాం ఏం జరుగుతుందో….
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More