Black Guava : పండ్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రతిరోజు పండ్లను తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే పండ్లలో శరీరానికి కావాల్సిన ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అలాంటి పండ్లలో జామకాయ కూడా ఒకటి. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారు వరకు జామకాయలను చాలా ఇష్టంగా తింటారు. అయితే ఆకుపచ్చ రంగులో ఉండే జామ పండ్ల గురించి మనందరికీ తెలుసు. కానీ నల్ల జామకాయల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా…? సాధారణ జామకాయలతో పోలిస్తే ఈ నల్ల జామకాయలో పోషకాలు కూడా అధిక స్థాయిలో ఉంటాయి.
అయితే ఈ జామకాయలు చాలా అరుదుగా లభిస్తాయి. అసలు ఈ నల్ల జామకాయ కథ ఏంటి ,ఈ నల్ల జామకాయలు తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నల్ల జామకాయలు లోపలి భాగం ఎర్రగా గులాబీ రంగులో ఉంటుంది. అలాగే దాని పూత కూడా గులాబీ రంగులోనే ఉంటుంది. అయితే ఈ జామకాయ చూడడానికి అంత ఆకర్షణీయంగా కనిపించకపోయినా దీనిలో శరీరానికి కావాల్సిన విటమిన్ ఏ ,విటమిన్ బి, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి.
వీటిని తినడం వలన శరీరంలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా తక్కువ అనారోగ్యానికి గురవుతారు. అలాగే నల్ల జామకాయలు యాంటీ ఎజింగ్ గుణాలను కలిగి ఉండడం వలన వృద్ధాప్యాన్ని నివారించి మిమ్మల్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇవి మీ చర్మంపై ముడతలను తొలగించి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న నల్ల జామకాయలు మనదేశంలో మాత్రం అసలు లభించవు. ఇవి చాలా అరుదుగా లభించే పండ్లు.ఇక ఈ పండ్లు ఎక్కువగా బ్రెజిల్ మరియు సౌత్ అమెరికాలో దొరుకుతాయి. అయితే ఈ నల్ల జామకాయల గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More