Actress Hema : ఇటీవల చాలామంది సెలబ్రిటీలు సినిమాలు, బుల్లితెర షోలు వదిలేసి అదనపు ఆదాయం కోసం సొంత బిజినెస్ లు స్టార్ట్ చేస్తున్నారు. ఇక ఇటీవలే జబర్దస్త్ కిరాక్ ఆర్పీ జబర్దస్త్ ను వదిలేసి సొంత వ్యాపారం ప్రారంభించాడు. అతను మొదలుపెట్టిన నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం బాగా సక్సెస్ అయింది. తాజాగా మణికొండలో మరో బ్రాంచ్ ఓపెన్ చేశాడు ఆర్పీ. అయితే ఆర్పీలా బిజినెస్ ప్రారంభించిన సెలబ్రిటీలలో ఒకరు హేమ. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది హేమ.
ఎన్నో ఏళ్లుగా ఆమె తెలుగు సినిమాలలో నటిస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి హేమ సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. అయితే తాజాగా ఆర్పీ మణికొండలో ఓపెన్ చేసిన చేపల పులుసు హోటల్ ఓపెనింగ్ కు నటి హేమ హాజరైంది. ఈ సందర్భంగా కొందరు ఆమెను మేడం మీరు ఈమధ్య సినిమాలో నటించడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు. అందుకు హేమ నేను కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను. దానిలో సంపాదన ఎక్కువయి సుఖపడడం అలవాటయింది. అందుకే కష్టపడాలని లేదంటూ సటైరికల్ గా సమాధానం ఇచ్చింది.
దాంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. ఆమెకు అంతలా ఆదాయం ఇచ్చే బిజినెస్ ఏంటా అని ఆలోచించసాగారు. అంతేకాక ఏ వ్యాపారం చేస్తున్నారు అని హేమను అడిగారు. అందుకు ఆమె మరో ఇంటర్వ్యూలో చెబుతాను అంటూ సమాధానం ఇచ్చారు. ఇక కిరాక్ ఆర్పీ మంచి కోరే వారిలో తాను ముందు వరుసలో ఉంటానని హేమ చెప్పుకొచ్చింది. అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సిద్ధాంతాన్ని తాను నమ్ముతాను అన్నది. కానీ హేమా మాటలు విన్నవారికి ఆమె నిజంగా అన్నదా లేక వెటకారంగా అన్నదా అర్థం కాలేదు. ఆమె కొత్త వ్యాపారం ప్రారంభించడం నిజమా కాదా అని చర్చించుకుంటున్నారు.
Must Read : Sports News : నిజాయితీ లేని ఓ ఆటగాడిపై జీవితకాల నిషేధం విధించిన క్రీడా సంస్థ ..
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More