Viral news : ప్రపంచమంతా టెక్నాలజీతో దూసుకెళుతుంటే ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన దీనికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. రోడ్డు మార్గం సరిగా లేక అంబులెన్స్ రాక ఓ మహిళ అడవిలోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పాల మామిడి గ్రామంలో జరిగింది. 22 ఏళ్ల దేవి అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ కనిపించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
కానీ గ్రామంలోకి అంబులెన్స్ రావడానికి రోడ్డు సరిగా లేకపోవడంతో ఆమెను బైక్ పై కొద్ది దూరం వరకు తీసుకెళ్లారు. ఇక మార్గంమధ్యం లోకి రాగానే ఆ మహిళ అడవిలోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీనిని గమనించిన కొందరు మహిళలు దేవికి సహాయం అందించారు. అయితే ఆ సమయంలో అడవిలో జన్మనివ్వడం ఏంటని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతోనైనా అధికారులు కళ్ళు తెరిచి రోడ్డు మార్గం ఏర్పాటు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అధికారులు ఎక్కడో ఉండి సేవలు అందిస్తున్నామని చెబుతూ మారుమూల గ్రామాలను పట్టించుకోకుండా ఉండడంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అంటారు. గ్రామాలను అభివృద్ధి చేస్తే దేశం అభివృద్ధి చెందినట్లే. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇటువంటి గ్రామాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరుకుందాం. పురిటి నొప్పులతో ఆ మహిళ ఎంత నరకాన్ని అనుభవించిందో , అదే రోడ్డు మార్గం సరిగా ఉంటే అంబులెన్స్ లో ఆమెకు డెలివరీ జరిగేది. ఏదేమైనా సరే అడవిలో జన్మనిచ్చిన ఆ మహిళ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More