Viral Video : ప్రతిరోజు సోషల్ మీడియా వేదికగా ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు నవ్వును తెప్పిస్తుంటే..మరి కొన్ని మాత్రం ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఇక కొన్ని కొన్ని వీడియోలు అయితే చూడగానే నోరేళ్ల పెట్టాల్సిందే.. కొందరు చావు చివరి అంచుల వరకు వెళ్లి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అయితే ఇలాంటిదే ఇప్పుడు ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతుంది. ఇక ఈ వీడియో చూస్తే..ఒక్క పూట కూటికోసం ఇంత కష్టం చేయాలా అని అనిపించక తప్పదు. నిజం చెప్పాలంటే పేదవాడు ఒక్క పూట ఆకలి కోసం చేసే పోరాటంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టేస్తాడు అనడంలో
ఎలాంటి సందేహం లేదు అని ఈ వీడియోని చూస్తే అర్థమవుతుంది. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోని చూస్తే.. ఓ కుర్రాడు భవన నిర్మాణ పనులను చేయడం మనం చూడొచ్చు . ఈ నేపథ్యంలో భూమి పై నుండి కొన్ని అడుగుల ఎత్తులో స్లాబ్ పని పూర్తి చేసేందుకు అతడు చెక్కలను పేరుస్తున్నాడు. అంత ఎత్తులో పనిచేస్తున్నప్పటికీ అతనికి ఎలాంటి సేఫ్టీ లేదు. ఇలా పనిచేస్తున్న యువకుడుని చూస్తే చూసేవారికి సైతం చమటలు పట్టి ఒళ్ళు జలతరించడం ఖాయం. అంతటి ఎత్తులో ఏ చిన్న తప్పు జరిగినా అక్కడికక్కడే దుర్మరణం ఖాయం .
అయినా కూడా ఎలాంటి భయం లేకుండా ప్రాణాలను ఫణంగా పెట్టి పొట్టకూటి కోసం అతడు ఇంత రిస్క్ తీసుకున్నాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోను హస్నా జరూరి హై , అనే ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఓ పేదవాడు చావు కంటే ఆకలికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని వీడియోను ట్విట్ చేస్తూ తెలియజేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోను ఇప్పటివరకు 40 వేల మంది చూడగా.. చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. పొట్టకూటి కోసం యువకుడు చేస్తున్న పని చూసి షాక్ అవుతున్నారు.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More