Yadadri : తెలంగాణలో మద్యం ఎంత డిమాండ్ ఉందో మన అందరికి తెలిసిందే. మద్యం అంటే చాలు మందు బాబులకు హుషారు వస్తుంది. ఒక్కరోజు మద్యం తాగకుండా ఉండలేని వారు చాలామంది ఉన్నారు. అలాంటివారు మద్యం సేవించేందుకు ఉర్రూతలూగుతుంటారు. మద్యం తాగకు అని చెప్పిన పట్టించుకోరు. కొంచెం మత్తు తగ్గిన మద్యం షాపుల ముందు వాలిపోతుంటారు. అయితే ఇలా మనుషులు చేయడం సహజమే. ఇలాంటివి మనం రోజు చాలానే చూస్తున్నాము. అయితే ఇప్పుడు ఒక మేక పిల్ల అచ్చం మందు బాబు లాగానే చేస్తుంది. మెక పిల్ల మద్యానికి బానిసైంది.
సాయంత్రం అయితే చాలు యజమాని వద్దకు వెళ్లి మద్యం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరి ఆ మేక సంగతి ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన మోదుగుంట అనే ఊరిలో సోలిపురం రవీందర్ రెడ్డి అనే రైతు ఉన్నాడు. ఆ రైతు ఒక మేక పిల్లను పెంచుకుంటున్నాడు. అయితే రోజు సాయంత్రం వేళ రవీందర్ రెడ్డి కి మద్యం త్రాగే అలవాటు ఉంది. సాయంత్రం అవ్వగానే తన ఇంటి వద్దనే మద్యం తాగుతుంటాడు.
ఈ క్రమంలో ఓ రోజు రవీందర్ రెడ్డి మేకకు మద్యం పట్టించాడు. అంతే ఆరోజు నుంచి సాయంత్రం అవ్వగానే రైతు వద్దకు వచ్చి ఎదురుచూపులు చూస్తుంది. మద్యం సేవించాక మత్తు లో నిద్రలోకి జారుకుంటుంది. అయితే రోజు మద్యం సేవిస్తున్న మేక ను చూపి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. మద్యం కేవలం మనుషులు మాత్రమే కాదు ఎలాంటి జంతువునైన ఇట్టే తనవైపు లాగేసుకుంటుందని ఈ కథనం ద్వారా అర్థమవుతుంది. అందుకే కాబోలు మందుబాబులు మందు లేకుండా ఒక క్షణం కూడా ఉండలేం అంటారు. ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More