Viral Video : ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. లాస్ ఏంజల్స్ నగరంలో ఓ నల్లజాతి మహిళను పోలీస్ అధికారి నేలకేసి కొట్టాడు. అంతేకాక ఆమెను నేలపై పడేసి తన మోకాలితో భూమికి అదిమిపెట్టి మరి బేడీలు వేశాడు. అంతేకాక నిరాయుధురాలిగా ఉన్న మహిళ ముఖంపై పెప్పర్ స్ప్రే ని కూడా వినియోగించాడు. అయితే ఈ ఘటన జూన్ 24న లాంకాస్టర్ లోని విన్కో గ్రోసరీ స్టోర్ వద్ద చోటుచేసుకుంది. అయితే స్థానిక మీడియా సంస్థలు అందిస్తున్న సమాచారం ప్రకారం..షాప్ లో దొంగతనానికి పాల్పడ్డాడని ఆరోపణపై ఓ నల్ల జాతి వ్యక్తిని పోలీసు అధికారులు అరెస్టు చేశారు.
అయితే ఆ వ్యక్తిని అరెస్టు చేసే సమయంలో పోలీసులు చేసే దౌర్జన్యాన్ని తన భార్య ఫోన్ లో రికార్డ్ చేయ సాగింది. ఇక ఇది గమనించిన ఓ పోలీసు అధికారి ఆమె దగ్గరికి వచ్చి గట్టిగా లాగి ఆమెను నెలకు విసిరి కొట్టాడు. అనంతరం తన మోకాలితో ఆమెను నేలకేసి అదిమి మహిళకు బేడీలు వేశాడు. సమీపంలో గల మరో మహిళ ఈ ఘటన వీడియోలో రికార్డ్ చేసింది. ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ వీడియో చూసిన నేటి జనులు పోలీసు అధికారులపై మండిపడ్డారు. దీంతో ఈ ఘటనపై స్పందిస్తూ లాస్ ఏంజెల్స్ కౌంటి పోలీస్ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేసింది. దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. దర్యాప్తు అనంతరం మా నిర్ణయాన్ని తెలియజేస్తామని అధికారులు తెలియజేశారు. అయితే పోలీసు అధికారులు ప్రజలతో మర్యాదగా గౌరవంగా వ్యవహరించాలని కౌంటి షరీఫ్ లూనా వ్యాఖ్యానించారు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న పోలీసు అధికారుల వివరాలు మాత్రం పోలీస్ శాఖ తెలియపరచలేదు. ఇక దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో వారిని విధులకు దూరంగా ఉంచాలని పలువురు పోలీస్ అధికారులకు తెలియజేశారు.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More