Hyderabad Metro Recruitment : నిరుద్యోగులకు శుభవార్త… హైదరాబాద్ మెట్రో నోటిఫికేషన్ విడుదల…రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం…

Hyderabad Metro Recruitment : నిరుద్యోగులకు హైదరాబాద్ మెట్రో సంస్థ శుభవార్తను తీసుకువచ్చింది . హైదరాబాద్ మెట్రో లో 9 రకాల పోస్ట్ ల ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 46 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగ భర్తీకి ఎలాంటి రాత పరీక్షలు ఉండవు. అభ్యర్థి మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? అర్హతలు ఏంటి…? లాంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మొత్తం ఖాళీలు : 46

* సిగ్నలింగ్ టీం లీడర్ పోస్ట్ ఖాళీలు – 3

* రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ పోస్ట్ ఖాళీలు  – 1

* రోలింగ్ స్టాక్ ఇంజనీర్ పోస్ట్ ఖాళీలు  – 1

* AFC/COM మెయింటెయినర్ పోస్ట్ ఖాళీలు  – 5

* రైలు ఆపరేటర్ పోస్ట్ ఖాళీలు  – 30

* AFC/COM సిస్టమ్ అనలిస్ట్ పోస్ట్ ఖాళీలు  – 1

* PSS ఇంజనీర్ పోస్ట్ ఖాళీలు  – 1

* PSS టీమ్ లీడర్ పోస్ట్ ఖాళీలు  – 2

*  MEP టీమ్ లీడర్ పోస్ట్ ఖాళీలు  – 2

 

విద్యార్హతలు…

ఈ పోస్టును భర్తీ చేసేందుకు డిప్లొమా ,ఐటిఐ ,బీఈ, బీటెక్ ,ఎంబీఏ ఎంసీఏ ,ఎంఎస్సీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్థికి సంబంధిత పనులలో అనుభవం ( experience certificate) కలిగి ఉండాలి.

వయస్సు…

అభ్యర్థి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అలాగే రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు వయసు సడలింపు వంటి ప్రయోజనాలు వర్తిస్తాయి.

దరఖాస్తు చేసుకునే విధానం….

అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా https://www.ltmetro.com/ లోకి వెళ్లాల్సి ఉంటుంది. Current opportunities అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి దానిని KeolisHyd.Jobs@keolishyderabad.com   కు పంపాలి.

ఎంపిక విధానం..

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. దానిలో క్వాలిఫై అయిన వారికి స్కిల్స్ టెస్ట్ పెట్టి వారి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాల కోసం .. …ఇక్కడ క్లిక్ చేయండి.

 

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More