Health Tips : అధిక మొత్తంలో మాంసాహారాన్ని తింటున్నారా.. అయితే ఇది మీకోసమే..

Health Tips : మానవ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే దానికి కావాల్సిన పోషకాలు అందించాలి. అయితే అధిక మొత్తంలో పోషకాలను అందించాలంటే మాంసాహారం మంచి ఎంపిక. అంతేకాక మనలో చాలామందికి మాంసాహారం అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎంత ఇష్టం ఉన్నప్పటికీ ఏదైనా పరిమితంగా తింటేనే ఆరోగ్యానికి మంచిది. ఇష్టం కదా అని మితిమీరి తింటే ఆరోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్రమంలో చికెన్ మటన్ ను కూడా పరిమితిగానే తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మరి ముఖ్యంగా రెడ్ మీట్ ను ఎక్కువగాా తినడం వలన కలిగే మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుందని వారు తెలియజేస్తున్నారు. మాంసం తినడం ఎక్కువైతే అనేక ఆరోగ్య సమస్యలు తప్పవని పరిశోధనలు సైతం హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో రెడ్ మీట్ ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎముకలు మరియు గుండె ఆరోగ్యం…

సాధారణంగా అయితే మాంసాహారం ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకల పనితీరు సక్రమంగా ఉండాలి అంటే రెడ్ మీట్ ను తప్పక తినాలి.అయితే మటన్ ను మరీ ఎక్కువగా తింటే బోన్స్ పై సైడ్ ఎఫెక్ట్స్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే దీనిలో కొవ్వు అధికంగా ఉంటుంది. తద్వారా దీనిని మనం ఎక్కువగా తినడం వలన రక్తంలో కొవ్వు శాతం పెంచి గుండె నాళాలను దెబ్బతీస్తుంది. దీంతో గుండె జబ్బులు బారిన పడే అవకాశం ఉంటుంది.

రక్తంలో ఆమ్లత్వం….

రెడ్ మీట్ ను ఎక్కువగా తినే వారి రక్తంలో ఆమ్లత్వం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివలన కొన్ని రకాల పోషకాలను శరీరం గ్రహించలేక ఎముకలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రక్తంలో ఆమ్లత్వం పెరిగితే ఎముకల నుండి కాలుష్యం పోయే అవకాశం ఉంటుంది.

కాల్షియం…

ఎముకలు గట్టిగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి అని మనందరికీ తెలిసిందే. అయితే మాసం నుండి లభించే అధిక కొవ్వు కారణంగా ఎముకలు కాల్సియం కోల్పోయే ప్రమాదం ఉంది.

మాంసాహారానికి ప్రత్యామ్నాయం….

మనం తీసుకునే మాంసాహారంకి ప్రత్యామ్నాయంగా వివిధ రూపాల్లో ప్రోటీన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలు, చేపలు, ప్రోటీన్ ఉండే మొక్కలను డైట్ లో చేర్చుకోవడం ద్వారా ప్రత్యామ్నాయం చేయవచ్చు.

 
ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More