NagaBabu Fires on Roja:ఇటీవల మంత్రి రోజా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రోజా చేసిన వ్యాఖ్యలపై నాగబాబు రియాక్ట్ అయ్యారు. మంత్రి రోజా మనదేశ పర్యాటకశాఖ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో20 స్థానాల్లో కేరళ,అస్సాం,గుజరాత్ లు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ 18వ ప్లేస్ లో ఉంది. ఇలాగే నువ్వు నీ బాధ్యతను మర్చిపోయి మాట్లాడితే , నువ్వు పదవి నుంచి దిగిపోయెలోగా మన రాష్ట్రం 20వ ప్లేస్ కు వచ్చే ఛాన్స్ ఉంది అన్నాడు. అంతేకాకుండా ఏపీ పర్యాటక శాఖ మీద ఆధారపడి ఎంతోమంది జీవిస్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారి జీవితాలు నాశనమయ్యాయి.
పర్యాటక శాఖ మంత్రిగా నువ్వు ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వాళ్ళ స్థితి మరింతగా దిగజారిపోతుంది. ముందు పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యతలు తెలుసుకో, పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటనలు చేయడం కాదు, ఆ శాఖను ఎలా అభివృద్ధి చేయాలో దాని గురించి ఆలోచించు అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇక తన సోదరులపై చేసిన విమర్శలకు స్పందిస్తూ నువ్వు ఇన్నాళ్లు మా అన్నయ్య, మా తమ్ముడు గురించి నీ నోటికొచ్చినట్లు మాట్లాడావు అయినా నేను రియాక్ట్ అవ్వలేదంటే దానికి కారణం నీ నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు.
ఎవరైనా చూస్తూ చూస్తూ మున్సిపాలిటీ కుప్ప తొట్టి జోలికి పోరు , నేను కూడా అలానే అనుకున్నాను . ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ బాధ్యతలను నువ్వు నెరవేర్చు అంటూ నాగబాబు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ట్విట్టర్ లో పెట్టిన ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. గతంలో రోజా నాగబాబు జబర్దస్త్ లో జడ్జ్ లుగా వ్యవహరించారు. ఇక రాజకీయాల విషయాలలో ఎప్పుడు నాగబాబు రోజాపై ఇలా వ్యాఖ్యలు చేయలేదు. తన అన్న, తమ్ముడు పై చేసిన కామెంట్స్ తట్టుకోలేక ఇలా రోజా పై మండిపడ్డాడు అని అందరూ అనుకుంటున్నారు.
Must Read: Rohit Sharma: రోహిత్, కోహ్లీనీ పక్కన పెట్టేసిన టీమిండియా .. దానికి కారణం ఏంటి ?
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More