Categories: Uncategorized

Viral News : పెళ్లి అనంతరం అత్తారింటికి వెళ్తుండగా…మార్గమధ్యంలో వధువు అరుపులు…తీరా చూస్తే

Viral News : ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అని ఊరికినే అంటారా… కొన్నిసార్లు అయితే వారు చేసే పనులకు చెప్పే మాటలకు అసలు సంబంధం ఉండదు. అయితే ఇలాంటివి ఎక్కువగా ప్రేమ వ్యవహారాలలో ,పెళ్లిళ్లలో చూస్తుంటాం. ఇలాంటి వార్తలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం ఇలాంటి వార్త ఒకటి నెట్టింటా చెక్కర్లు కొడుతుంది. కార్ లో వెళ్తున్న వధువు వాంతి వస్తుంది అనడంతో వరుడు కారు ఆపుతాడు. వెంటనే కార్ దిగిన వధువు అరుపులు కేకలతో డ్రామా క్రియేట్ చేసింది. అసలేం జరుగుతుందో వరుడుకి అర్థం కాలేదు. వధువు తండ్రి వచ్చి అసలు నిజం చెప్పేసరికి అందరూ షాక్ అయ్యారు. అయితే బీహార్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటివల పెళ్లి చేసుకున్నారు.

బంధువులు స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.  అయితే వీరి సంప్రదాయం ప్రకారం వివాహమైన తర్వాత ఐదు రోజులపాటు వధువు అత్తగారింట్లోనే ఉండాల్సి ఉంటుంది. దీంతో పెళ్లి అయిపోయిన తర్వాత వధువు తరుపువారు వధువుకు వీడ్కోలు చెప్పి అత్తగారింటికి పంపించారు. వధువును కారులో ఎక్కించుకొని వరుడు తన ఇంటికి బయలుదేరాడు. అప్పటివరకు బాగానే ఉన్నా వధువు కారు ఎక్కగానే కంగారుగా కనిపించింది. కొత్త కదా అలాగే ఉంటుంది , ఒకరోజు గడిస్తే అంత సర్దుకుంటుంది అని అందరు అనుకున్నారు. అయితే అత్తగారి ఇల్లు దగ్గర పడేకొద్దీ ఆమెలో మరింత ఆందోళన మొదలైంది. ఇక మార్గమధ్యంలో కారులో ఉన్నవారికి వాంతి రావడంతో కారును ఆపారు. కారు ఆపిన వెంటనే వధువు కారు దిగి ఏడుస్తూ గట్టిగా అరవసాగింది.

రక్షించండి…రక్షించండి.. నన్ను కిడ్నాప్ చేశారంటూ కేకలు పెట్టింది. అప్పటివరకు మంచిగా ఉన్న వధువు ఇలా చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎవరు చెప్పిన వినకపోవడంతో చుట్టుపక్కల వారంతా గుమ్మిగూడారు. వివాహ దిస్తుల్లో ఉన్న వధువు అలా మాట్లాడటం చూసి అక్కడికి వచ్చిన వారు కూడా ఆశ్చర్యపోయారు. చేసేదేమి లేక వరుడు వధువు తండ్రికి ఫోన్ చేయగా , వెంటనే అతను సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. కిడ్నాప్ లేదు ఏం లేదు అత్తగారింటికి వెళ్లడం ఇష్టం లేక ఇలా చేసిందంటూ చెప్పడంతో అందరూ ఆవాక్కయ్యారు. ఆమె బాధను చూసిన వరుడు తండ్రి తో పాటే ఆమెను పుట్టింటికి పంపించారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా చర్చనియాంశంగా మారింది.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More