Hyderabad : పెట్రోల్ డీజిల్ కొరతపై క్లారిటీ…ఇకనుండి నో టెన్షన్…

Hyderabad  : హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ బంకులన్నీ మూతపడ్డాయి. దీంతో వాహనదారులందరూ పెట్రోల్ బంకుల ముందు బారులు తీరారు. అయితే తాజాగా ట్యాంకర్ డ్రైవర్ల నిరసనతో పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులను పెట్టడం జరిగింది. ట్యాంకర్ డ్రైవర్లు చేపట్టిన సమ్మె వలన రాష్ట్రంలో భారీ ఎత్తున ఇంధన కొరత ఏర్పడింది. హెచ్పి బీపీసీ ఐఓసి కంపెనీల నుంచి పెట్రోలు సరఫరా చేసే ట్యాంకర్ డ్రైవర్లు , హైదరాబాద్ చర్లపల్లి ఆయిల్ కంపెనీల వద్ద ధర్నాకు పూనుకున్నారు. జనవరి 2 సోమవారం ఉదయం నుంచి డ్రైవర్లు అందరూ నిరసనలు చేపట్టారు. అయితే ఈ నిరసనలు చేయడానికి గల ముఖ్య కారణం తాజాగా కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాలు చట్టంలో కొన్ని సవరణలు చేయడమే. ఇక దీనిలో భాగంగా ప్రమాదం చేసి పారిపోతే పదేళ్ల శిక్షతోపాటు ఏడు లక్షల జరిమానా మరియు కఠిన శిక్ష పడే విధంగా తాజాగా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది.

దీంతో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు ఈ నిబంధనలు తమకు గుదిబండలా మారాయని ప్రభుత్వం చేపట్టిన ఈ నిబంధనలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ధర్నాలు చేపట్టారు. ఇక ఈ మూడు కంపెనీల నుండి ప్రతిరోజు దాదాపు 18 వేల కిలోమీటర్లు పెట్రోల్ డీజిల్ సరఫరా జరుగుతుండగా తాజాగా ట్యాంకర్ డ్రైవర్లు చేపట్టిన నిరసనలతో ఒక్క ట్యాంకర్ కూడా కంపెనీ నుంచి బయటకు వెళ్లలేదు. దీంతో హైదరాబాద్ నగరంలోని సగానికి పైగా పెట్రోల్ బంకులన్నీ మూతపడ్డాయి. దీంతో చర్లపల్లి లోని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్యాంకర్ డ్రైవర్లతో సంభాషణలు జరిపి నిరసనను విరమింప చేశారు. దీంతో సోమవారం సాయంత్రం 6:00 సమయంలో కంపెనీ నుండి ఆయిల్ ట్యాంకర్లు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అన్ని బంకులలో యధావిధిగా పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

అయితే హైదరాబాదులోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే రెండు రోజులు వరకు పెట్రోల్ బంకులు అన్ని బంద్ అనే చెప్పడంతో ఒక్కసారిగా వాహనదారులు అందరు బంకులలో క్యూ కట్టారు. ముందస్తు జాగ్రత్తగా ఎక్కువ మొత్తంలో పెట్రోలు స్టోర్ చేసుకుని పెట్టుకున్నారు. దీంతో కొన్ని బంకులలో ఇంధనం పూర్తిగా అయిపోయింది.దీంతో ఇప్పటికి కొన్ని బంకులు నో స్టాక్ బోర్డు పెట్టి మూసేశారు. ఈ నేపథ్యంలోనే ఆయిల్ ట్యాంకర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ తాజాగా కీలక ప్రకటన చేశారు. ఇకపై తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ సమ్మె లేదని పెట్రోల్ డీజిల్ కు సంబంధించి ఇక కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన తెలియజేశారు. కేంద్ర చట్టం సవరణతో కాస్త గందరగోళం ఏర్పడిందని ఇప్పటినుండి ఆయిల్ ట్యాంకర్లు యధావిధిగా నడుస్తాయని ఆయన స్పష్టం చేశారు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More