Zomato Delivery Boy : మారుతున్న ఆధునిక కాలంలో భాగంగా ప్రస్తుతం ఆన్లైన్ లోనే ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం నిమిషాల వ్యవధిలోనే డెలివరీ అవ్వడం, రుచికరమైన ఆహారంతో తమ ఆకలిని తీర్చుకోవడం చాలా సులభంగా జరిగిపోతున్నాయి. తమకు నచ్చిన ఫుడ్ ను నచ్చిన రెస్టారెంట్ లేదా హోటల్ నుండి ఆన్లైన్ ద్వారా ఇంటి ముందుకు వచ్చేలా చేసుకోవడం చాలా సులువు అయిపోయింది. అయితే ఇలా ఫుడ్ ను ఇంటి వరకు తీసుకురావాలంటే దానిలో చాలా మంది కష్టం దాగి ఉంటుంది. మరి ముఖ్యంగా డెలివరీ బాయ్స్ శ్రమ మాటల్లో వర్ణించలేనిది. వారు తిన్న తినకపోయినా , ఆహారాన్ని మాత్రం సరైన సమయానికి చేరవేస్తున్నారు. ఎండ ,వాన ,చలి ఏమి పట్టించుకోకుండా జీవనోపాధి కోసం పరుగులు పెడుతున్నారు. అయితే వీరు ఇంత కష్టపడుతున్నప్పటికీ వారికి తగిన చెల్లింపు మాత్రం దక్కడం లేదు.
అయినా వాటిని పట్టించుకోకుండా చమటోడ్చి కడుపు నింపుకుంటున్నారు. అయితే ఈ డెలివరీ బాయ్స్ కష్టాన్ని నిజం అనిపించేలా ఇప్పుడు ఒక వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో జొమాటో డెలివరీ బాయ్ ప్లాస్టిక్ కవర్ లో అన్నం తింటూ కెమెరా కంట పడ్డాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారి అవనిష్ శరణ్ ట్విట్టర్ వేదికగా దీనిని షేర్ చేశారు. సంక్లిష్టమైన పరిస్థితిలో పనిచేస్తున్న ఇలాంటి కష్టజీవుల పట్ల జాగ్రత్త తీసుకోండి అంటూ ఆయన క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో లో జొమాటో కు చెందిన డెలివరీ బాయ్ డెలివరీ తర్వాత లంచ్ బ్రేక్ తీసుకున్నట్లు అర్థమవుతుంది.
అయితే ఒకచోట కుదురుగా కూర్చుని తినకుండా కవర్ లో ఉన్న ఆహారాన్ని బైక్ మీద పెట్టుకొని నిలబడి హడావిడిగా తింటు కనిపించాడు. అందరికీ రుచికరమైన ఆహారాన్ని అందించే డెలివరీ బాయ్స్ కనీసం ఒకచోట కూర్చుని తినేందుకు వీలు కూడా దొరకడం లేదని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అంతేకాక ప్లాస్టిక్ కవర్ లో ఆహారాన్ని తింటున్న డెలివరీ బాయ్ ని చూసి నేటిజనులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంతలా కష్టపడుతున్న వారికి కనీసం మర్యాదలు కూడా దొరకడం లేదని దయచేసి ఇలాంటి కష్టజీవులకు కాస్తంత మర్యాద అయిన ఇవ్వండి అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. డెలివరీ కాస్త ఆలస్యమైతే డెలివరీ బాయ్స్ మీద కస్సుబుస్సు లాడేవారు ఈ వీడియో ద్వారా అయినా వారి పరిస్థితిని అర్థం చేసుకుంటే బాగుంటుంది.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More