Viral News : పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మి సినిమా అందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసిన వ్యక్తికి జ్యోతిలక్ష్మి అనే వేశ్య మొదటి చూపులోనే నచ్చడంతో రోజు ఆమె వద్దకు వెళ్లి పెళ్లికి ఒప్పిస్తాడు. తర్వాత ఆమెను పెళ్లి కూడా చేసుకుంటాడు. ఆ తర్వాత వీరిద్దరి జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనం ఆ సినిమాలో చూశాం. అయితే ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే అచ్చం జ్యోతిలక్ష్మి సినిమాలో జరిగినట్లు నిజ జీవితంలోను జరిగింది. మొదటి చూపులోనే వేశ్య ను ఇష్టపడ్డ ఓ యువకుడు.. ఆమెను పెళ్లి చేసుకుంటానని వ్యభిచారాన్ని వదిలేయంటూ 20 ఏళ్ల వయసుగల వేశ్య కు ఆఫర్ ఇచ్చాడు.
వివరాల్లోకెళ్తే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బంగ్లాదేశ్ కు చెందిన కొంతమంది అమ్మాయిలను కొందరు ముఠా సభ్యులు ఢిల్లీకి తీసుకుని వచ్చారు. ఇక వారిని ఢిల్లీలో ఒక హోటల్లో ఉంచి సర్టిఫికెట్లు మరియు ఫోటోలను తీసుకున్నారు. అనంతరం వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపేశారు. ఒప్పుకోని వారిని బెదిరింపులకు గురి చేశారు. వీరిలో 20 ఏళ్ల యువతని జనవరి 28 న బంగ్లాదేశ్ నుండి ఢిల్లీకి తీసుకురావడం జరిగింది. మరి కొంతమందిని హర్యానాలోని ఫరీదాబాద్ లో వివిధ హోటలకు పంపించారు. ఇక అప్పటినుండి ఆమె వ్యభిచారం చేయడం మొదలైందట.
ఈ క్రమంలో ఇటీవల దినేష్ అనే వక్తి ఆ హోటల్ కి వెళ్ళాడు. అక్కడ ఈ యువతను చూడగానే ప్రేమలో పడిపోయాడు. ఎలాగైనా ఆమెని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న దినేష్…ఈ వ్యభిచారాన్ని వదిలే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ యువతకి చెప్పడంతో ఆమె కూడా అంగీకారం తెలిపింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి బయటికి వెళ్తుండగా వ్యభిచార ముఠా వారిని అదుపులోకి తీసుకొని ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. ఇంకోసారి ఆమె జోలికి వస్తే చంపేస్తామంటూ దినేష్ ను బెదిరించారట. అయినా కూడా భయపడని దినేష్ చివరిగా తన స్నేహితుల సహాయంతో ఆమె నెంబర్ ను కనుక్కొని ఫోన్ చేశాడు. బల్లభగడ్ ప్రాంతానికి ఆమెను రమ్మని కోరాడట దినేష్. ఆమె కూడా దినేష్ చెప్పినట్లుగానే అక్కడికి వచ్చింది.
తర్వాత ఇద్దరు కలిసి ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. అనంతరం మాకు భద్రత కల్పించండి అంటూ కోర్టును ఆశ్రయించారు. ఇక వీరు ఇచ్చిన సమాచారం తెలుసుకొని చర్యలు చేపట్టాలంటూ కోర్టు పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. వీరిలో కొంతమందిని అదుపులోకి తీసుకొగా, మరి కొంతమంది కోసం గాలింపులు చేపట్టారు. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దినేష్ చేసిన ఈ ఒక్క పని తాను ప్రేమించిన అమ్మాయి తో పాటు ఎంతోమంది అమ్మాయిలను రక్షించిందని చెప్పాలి. మరీ ఈ ఘటనపై మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More