Viral Video : ఆస్ట్రేలియా అంటే ముందుగా గుర్తొచ్చేది కంగారూలు. ఇక వాటిని చూసేందుకే చాలామంది పర్యటకులు ఆస్ట్రేలియా కి వెళుతుంటారు. అయితే కంగారూలకు సాదు జంతువులని పేరుంది. అవి ఎప్పుడు కూడా మనుషుల జోలికి రావు వాటి పని అవి చూసుకుంటాయి అంటారు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో మాత్రం ఓ కంగారు దీనికి భిన్నంగా వ్యవహరించింది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ కంగారు వ్యక్తిపై దాడికి దిగింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ జంతు ప్రదర్శనశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
వైరల్ అవుతున్న వీడియోలు ఓ మహిళ జూ లో నడుచుకుంటూ వస్తుంది. ఇంతలో ఆమెను ఓ కంగారు వెంటపడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న వ్యక్తి కంగారును అడ్డుకొని మహిళను రక్షించాడు. వెంటనే మహిళా అక్కడి నుండి దూరంగా వెళ్ళింది. దీంతో కంగారూ వ్యక్తితో ఫైటింగ్ కు దిగింది. కంగారూను అతడు దూరంగా నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ కంగారూ మాత్రం అతని మీద దాడి చేస్తూనే ఉంది. దీంతో వ్యక్తి కంగారూ మెడను పట్టుకుని వెనక్కి తీసుకెళ్లాడు.
అయినా సరే కంగారూ బెదరకుండా అతని మీద దాడి చేస్తూనే ఉంది. తోకను బలంగా భూమికి అనించి కాలతో వ్యక్తిని తన్నే ప్రయత్నం చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వ్యక్తి అమెరికాకు చెందిన పర్యాటకుడని సమాచారం. అయితే కంగారూలు ఎవరైనా రెచ్చగొడితే తప్ప ఇలాంటి పనులు చేయవని నిజం చెప్పాలంటే అవి చాలా ప్రశాంతంగా ఉంటాయని జూ కు సంబంధించిన సిబ్బంది తెలియజేశారు. వాటికి కోపం తెప్పించే పనులు చేస్తే ధైర్యంగా పోరాడతాయని , వెనక కాళ్లతో పంజా విసురుతాయని తెలిపారు.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More