Viral Video : కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు…పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఈ అన్నను చూస్తే ఈ మాట అనక తప్పరు.

Viral Video : మన జీవితంలో ఏదైనా సమస్య ఎదురైతే చాలామంది నానా హైరానా చేస్తుంటారు. జీవితం ముగిసిపోయింది చేయడానికి ఏం లేదంటూ చేతులెత్తేస్తారు. చిన్న సమస్యలకే ఇలా అనుకుంటే ఏదైనా ప్రమాదం జరిగి చెయ్యో లేదా కాలో పోతే , అలాంటి పరిస్థితి తలుచుకుంటేనే భయమేస్తుంది కదా. ఇలాంటివారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇలా జరగడం వలన వారు పూర్తిగా కృంగిపోయి వారి జీవితం పట్ల తీవ్ర అసంతృప్తి చెందుతారు. కొంతమంది అయితే అన్నీ సరిగ్గా ఉన్నా సరే చేతకాక సాకులు చెబుతూ కాలం గడిపేస్తుంటారు. కొందరు మాత్రం వీటన్నింటినీ ఎదిరించి జీవితాన్ని ఎదుర్కొంటారు. అలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం.

కాలు లేని అతను అంగవైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపిస్తున్నారు. కాలు లేకపోయినా తనదైన శైలిలో జీవితాన్ని సాగిస్తూ తన కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. ఇక ఆ వ్యక్తి తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నేటి జనులు అతనికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ వీడియోను లుటేరా అనే ట్విట్టర్ యూజర్ ఈనెల 2న సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియోలో ఒక కాలు లేని వ్యక్తి పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు. అయితే మొదట ఒక కారు వచ్చి ఆగగా దానికి ఫుయేల్ ఫుల్ చేసిన అతను మరికొద్ది సేపటికి మరొక కారు రావడంతో…

ఆ కార్ వద్దకు ఒంటికాలతో కుంటూతూ వెళ్లి దానిలో కూడా పెట్రోల్ కొట్టించడం గమనించవచ్చు. ఇలా ఆ వ్యక్తి ఒంటికాలతో కష్టపడడం చూసి అతనిని పలకరించి, నీకు జీవితం పై నీకు ఏమైనా అసంతృప్తి ఉందా అని అడగగా, అలాంటివేమి లేవండి … కేవలం నేను నా పని చేసుకుంటూ వెళ్తాను మిగతా వాటితో నాకు పని లేదు అని సమాధానం ఇచ్చాడు. ఇదంతా కారులోని వ్యక్తి రికార్డ్ చేశాడు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. దీంతో ఇప్పటివరకు ఈ వీడియోని 1.17 లక్షలు మంది వీక్షించారు. ఈ వీడియో చూసిన నేటిచెనులు స్పందిస్తూ …అన్న గుండె ధైర్యానికి సెల్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More