Snake Operation : ప్లాస్టిక్ మూత మింగిన పాముకు ఆపరేషన్ చేసి మూతను బయటకు తీసిన డాక్టర్లు…వైరల్ వీడియో

Snake Operation : ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ అనేది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పెను సవాలుగా మారింది. ఎవరు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్లాస్టిక్ వినియోగం ఏ మాత్రం తగ్గడం లేదు. మరి ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ అనే మహమ్మారికి ఎన్నో మూగజీవులు బలైపోతున్నాయి. ఆవులు గేదెలు వంటివి గడ్డితోపాటు ప్లాస్టిక్ ని తిని ప్రాణాలను కోల్పోతున్నాయి. అయితే కేవలం భూమి మీద మాత్రమే కాకుండా సముద్రాలలో కూడా ప్లాస్టిక్ అధిక మొత్తంలో పేరుకు పోయింది. దీని కారణంగా సముద్ర గర్భాలలో జీవించే జీవులు కూడా అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

అయితే తాజాగా ఓ పాము ఇలాంటి సమస్యను ఎదుర్కొంది.  దీంతో ప్రస్తుతం ఈ పాము కు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే వైరల్ అవుతున్న వీడియో లో ఓ కింగ్ కోబ్రా ప్లాస్టిక్ మూతను మింగేసిందట. దీంతో ఇది గమనించిన డాక్టర్లు ఆ పాముకి ఆపరేషన్ చేసి మూతను తీసేశారు. ముందుగా డాక్టర్లు ఆ పాము పొట్టను ఎక్స్ రే తీశారు. ఇక ఆ ఎక్స్ రే లో ప్లాస్టిక్ మూత స్పష్టంగా కనిపించడంతో, పాముకు ఆపరేషన్ చేసి మూతను బయటకు తీశారు. అచ్చం మనుషులకు చేసినట్లుగా పాముకు మత్తుమందు ఇచ్చి,

తర్వాత దానికి ఆక్సిజన్ మాస్క్ తగిలించి ఆపరేషన్ చేపట్టారు. ఆ తర్వాత పాము పొట్టలో ఉన్న ప్లాస్టిక్ మూతను బయటకు తీశారు. మూతను బయటకు తీసిన తర్వాత మరల పాము పొట్ట కు తిరిగి కుట్లు వేశారు. అయితే ఈ ఆపరేషన్ మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నీటిజనులు పాముకు ఆపరేషన్ చేసిన వైద్యులను ప్రశంసిస్తున్నారు .

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More