Tamannaah : ఎయిర్ పోర్ట్ లో వైట్ స్క్రీన్ బ్యూటీ తమన్నా భాటియా డాన్స్….. వైరల్ వీడియో…..

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తన అభిమానులకు ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. సోషల్ మీడియాతో పాటు బయట కూడా తన ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ వస్తుంది. తమన్నా వీరాభిమాని ఒకరు తన ఫోటోను పచ్చబొట్టు వేయించుకోగా అది చూసిన మిల్కీ బ్యూటీ ఎమోషన్ అవ్వడం మీరు చూసే ఉంటారు. అలా తనను ఆదరించే అభిమానులు అంటే తమన్నాకు ఎంతో మక్కువ. ఈ నేపథ్యంలో తాజాగా తమన్నా ఎయిర్ పోర్ట్ లో తన అభిమానితో కలిసి డాన్స్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి ఇటీవల తమన్నా నటించిన సినిమా జైలర్. .

ఇక ఈ సినిమాలోని ‘వా నువ్వు కావాలయ్యా ‘ అనే పాట యొక్క లిరికల్ వీడియోను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ పాటలోని తమన్నా డాన్స్ అందరిని బాగా ఆకట్టుకుంది. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ పాట దుమారం లేపుతుంది. ఈ క్రమంలో తమన్నా అభిమానుల కంటపడితే చాలు ఆ పాటకు డాన్స్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుతున్నారు. అయితే తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చిన తమన్నా ను తనతో కలిసి ఆ పాటకు డాన్స్ చేయాల్సిందిగా ఓ అభిమాని కోరాడు. అంతేకాక అక్కడున్న మీడియా మిత్రులు కూడా పదేపదే అడగడంతో తమన్నా అంగీకరించింది. తన అభిమానితో కలిసి ఆ పాటకు అక్కడే డాన్స్ చేసింది.

అనంతరం నాకంటే చాలా బాగా చేశావంటూ తమన్నా అభిమానిని మెచ్చుకుంది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ లిరికల్ వీడియో పై తమన్న బాయ్ ఫ్రెండ్ విజయవర్మ కూడా స్పందించారు. తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ పాటలోని తమన్నా డాన్స్ ని షేర్ చేస్తూ…పాట అద్భుతంగా ఉందంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. అంతేకాక ఈ సినిమాకు రజనీకాంత్ దేవుడైతే…తమన్నా దేవత అంటూ రాసుకొచ్చాడు . అయితే విజయవర్మ కామెంట్స్ కు పలువురు ఆగ్రహం వ్యక్తం చేయగా కొందరు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More