Tiger Nageswara Rao : ఇటీవల మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుండి నెగిటివ్ టాక్ తో నడిచింది.ఇక సినిమాలోని ఫస్ట్ ఆఫ్ పర్వాలేదు అనిపించిన సెకండాఫ్ లో డ్రామా ఎక్కువ అవ్వడంతో దెబ్బతింది. అలాగే దాదాపు 3 గంటల సినిమాను అరగంట తగ్గించి విడుదల చేసినప్పటికీ ఫలితం దక్కలేదు.
అంతేకాక టైగర్ నాగేశ్వర సినిమాకు బాలకృష్ణ భగవాన్ కేసరి మరియు విజయ్ తలపతి లియో సినిమా గట్టి పోటీపోటీ ఇవ్వడంతో 35 కోట్ల టార్గెట్ తో బరిలో దిగిన టైగర్ నాగేశ్వరరావు 20 కోట్ల వసూలను మాత్రమే అందుకుంది. ఇది ఇలా ఉండగా తాజాగా టైగర్ నాగేశ్వరరావు ఓటిటిలోకి విడుదలైంది. సినిమా విడుదలైన నెల రోజులకే ఈ రోజు నవంబర్ 17 నుండి టైగర్ నాగేశ్వరరావు సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. కావున అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఫ్రీగా చూసేయొచ్చు.
ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. అయితే ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా టైగర్ నాగేశ్వరరావు సినిమాను సైలెంట్ గా ఓటిటిలోకి విడుదల చేయడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఈ టైగర్ నాగేశ్వరరావు సినిమా సువర్టపురం గజదొంగ నాగేశ్వరరావు యొక్క జీవిత కథ ఆధారంగా రూపొందించడం జరిగింది. ఇక ఈ సినిమాలో రవితేజకు జంటగా నుపూర్ సనన్ నటించింది.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More