Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ వయసులో కూడా చాలా అందంగా, మంచి ఫిట్నెస్ తో కనిపిస్తున్నారు. 50 ఏళ్ల వయసుకు దగ్గర అవుతున్న మహేష్ బాబు అందం ఏం మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలాగా కనిపిస్తున్నాడు. అయితే ఆయన అందానికి, వయసు తగ్గడానికి అసలు రహస్యం ఏమిటో తెలియదు కానీ ఆరోగ్యమైన ఆహారం, క్రమం తప్పకుండా వర్కౌట్లు చేయడం అనేది ఓ కారణం. చాలాసార్లు మహేష్ తన సోషల్ మీడియా ఎకౌంట్లో వర్క్ అవుట్ చేసే వీడియోలు పోస్ట్ చేశారు. తాజాగా మహేష్ జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. మై సాటర్ డే సిజిల్ సెట్. నా ఫేవరెట్ స్కిల్ మిల్ ఫినిషర్, నిమిషం పాటు ల్యాండ్ మైన్ ప్రెస్, నిమిషం పాటు కెటిల్ బెల్ స్వింగ్స్, నిమిషం పాటు స్కిల్ మిల్ రన్, మీరు ఎన్ని చేస్తారు ..
అంటూ మహేశ్ తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి రాసుకొచ్చారు. అలానే తన వర్కౌట్లతో అభిమానుల్లో స్ఫూర్తిని నింపారు. జిమ్ లో చాలా కష్టపడుతూ, చాలా గ్లామర్ గా కనిపిస్తున్నారు. మెరుపు వేగంతో ఇంటెన్స్ వర్కౌట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు దీన్ని వైరల్ చేస్తున్నారు. ఓ హీరో ఇంత యంగ్ అండ్ ఫిట్ గా కనిపించడానికి వెనుక ఇంత కష్టం దాగి ఉంటుందని మహేష్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. ఎప్పుడు ఫిట్ గా ఉండే మహేష్ గత కొన్ని రోజులుగా బాడీ షేప్ ని మరింత ఫిట్ గా చేసే పనిలో ఉన్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ గుంటూరు కారం ‘ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసమే మహేష్ జిమ్ లో వర్కౌట్లు చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో సినిమా చేయనున్నాడు. ఇక రాజమౌళి సినిమా అంటే హీరో ఎలా ఉండాలో అందరికీ తెలిసిందే. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో భారీ అడ్వెంచర్ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా కోసం జిమ్ లో వర్కౌట్ చేస్తున్నాడని తెలుస్తోంది.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More