Balagam DirectorVenu Yeldandi : తన సినిమాకు స్టార్ హీరో కావాలని అడిగిన వేణుకు షాక్ ఇచ్చిన నిర్మాత ….ఇప్పటికి నమ్మకపోతే ఎలా…

Balagam DirectorVenu Yeldandi : జబర్దస్త్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన కమెడియన్ వేణు ఇటీవల బలగం సినిమాతో డైరెక్టర్ గా మారాడు. అంతకుముందు చాలా సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించిన వేణు కొన్ని సినిమాల్లో మంచి పాత్రలు లభించినప్పటికీ సరేనా ఇమేజ్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. ఆ తర్వాత మళ్లీ తిరిగి జబర్దస్త్ ద్వారా ఫామ్ లోకి వచ్చి తనతో పాటు షో కి కూడా మంచి క్రేజ్ను తీసుకొచ్చాడు. అయితే జబర్దస్త్ వేణు డైరెక్టర్ గా మారుతున్నాడు అన్న వార్త తెలిసినప్పుడు ప్రతి ఒక్కరు కమెడియన్ కాబట్టి ఏదో కామెడీ సినిమా చేస్తున్నాడేమో లే అనుకున్నాను. కానీ బలగం వంటి సినిమాతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. తెలంగాణ పల్లె నేపథ్యంలో వచ్చిన బలగం సినిమా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను ఎంతగానో అలరించింది.

చేసిన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల నుండి వందకి వంద మార్కులు తెచ్చుకున్నాడు వేణు. అంతేకాక ఇటీవల జరిగిన తెలంగాణ గ్రూప్ ఫోర్ పరీక్షలో కూడా బలగం సినిమా నుండి ఒక ప్రశ్న అడిగారంటే ఈ సినిమా ఎంతటి స్థానాన్ని సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. కమెడియన్ అయి ఉండి కూడా ఇంతటి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ సినిమాను అందించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు వేణు. ఇక ఈ సినిమా పెట్టిన బడ్జెట్ కి 3 రెట్లు ఎక్కువగానే వసూలు చేసింది. దీంతో దిల్ రాజ్ వేణుకు మరో లక్కీ ఛాన్స్ ఇచ్చాడు. ఈసారి శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో వేణు సినిమా చేసేందుకు అవకాశం కల్పించాడు. తన మొదటి సినిమాను భారీ బ్లాక్ బాస్టర్ అందుకున్న వేణుకి ఈసారి బడ్జెట్ విషయంలో కూడా రాజీ పడకూడదని దిల్ రాజ్ ఫిక్స్ అయ్యాడట.

అంతేకాక వేణు కూడా తన నెక్స్ట్ సినిమాలో స్టార్ హీరో కావాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే వేణు ఇలా అడగడం చూసి నిర్మాత దిల్ రాజు కూడా షాక్ అయ్యారట. అయితే బలగం లాంటి భారీ బ్లాక్ బస్టర్ అందించిన తర్వాత కూడా వేణు టాలెంట్ ని గుర్తించకపోతే ఎలా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వేణుకి ఉన్న టాలెంట్ కు కోరిన బడ్జెట్ తో పాటు అడిగిన హీరోని ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ విషయాన్ని దిల్ రాజ్ అడిగితే మాత్రం కాదనే ఛాన్స్ లేదు. మరి వేణు తన నెక్స్ట్ సినిమాను ఏ హీరోతో చేస్తాడో వేచి చూడాల్సిందే.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More