Sitara Ghattamaneni : మనల్ని ఎవడ్రా ఆపేది…మహేష్ బాబు కూతురు సితార కామెంట్స్ వేరల్…

Sitara Ghattamaneni  : సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. రీల్స్ డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. అలాగే ఇంట్లో పండుగలు జరిగిన , ఏదైనా ప్రత్యేకమైనవి జరిగిన ఇలా అన్నిటికీ సంబంధించినవి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక సితార మంచి మనసు గురించి కూడా అందరికీ తెలుసు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు సైకిళ్ళు బహుమతిగా అందించింది. అలాగే తాను మొట్టమొదట సంపాదించిన రెమ్యూనరేషన్ మొత్తాన్ని మహేష్ ఫౌండేషన్ కి అందించింది. అలాగే ఇటీవల ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో భాగంగా వెళ్లిన సితార అక్కడ ఉన్న పెద్దవారితో వ్యవహరించిన తీరు అందర్నీ ఆకట్టుకుని ప్రశంసించేలా చేసింది.

అయితే తాజాగా సితార తన తండ్రి మరియు తాతయ్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తూ తన ఇన్స్టా వేదికగా ఎమోషనల్ పోస్టును షేర్ చేసింది. ఇటీవల నేషనల్ సినిమా డే కావడంతో తన కుటుంబ సినిమా జీవితం గురించి సితార చెప్పుకొచ్చింది. సినిమా నా జీవితంలోనే ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని, ఇది నాకు కేవలం ఇండస్ట్రీ కాదు ఇది నా డిఎన్ఏ లోనే ఉంది. సిల్వర్ స్క్రీన్ పై నా తండ్రి ఒక సూపర్ స్టార్,ఆయన నాకు స్ఫూర్తిదాయకం, అలాగే మా నాన్నకు మా తాత పూర్తి దయకమని చెప్పింది. మా తాత గారి ప్రయాణం మా జీవితాలకు ఎంతో ప్రభావితమైందని ఇలాంటి వారసత్వంలో నేను భాగమైనందుకు ఎంతో గౌరవంగా ఉందని సితార రాస్కొచ్చింది.

అలాగే తమ కుటుంబాన్ని సపోర్ట్ చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.దీంతో ప్రస్తుతం సితార చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా సితార త్వరలోనే సినీ రంగంలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభిమానులు సినిమాలు చేయకుండా నిన్ను ఎవరు ఆపేదంటూఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు తన తండ్రితో కలిసి కొన్ని యాడ్స్ లో నటించిన సితార ఇప్పుడు సింగిల్ గానే యాడ్స్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోని ఇటీవల జ్యువెలరీ షాప్ కి సంస్థకి సితార బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. ఇక దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయ్యో అందరికీ తెలిసిందే.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More