Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ హాలీవుడ్ వరకు వెళ్లిపోయింది. హాలీవుడ్ మేకర్స్ సైతం రామ్ చరణ్ ని ప్రశంసించక తప్పలేదు. సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఇలాంటి భారీ బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య కాస్త చేదు అనుభవాన్ని మిగిలించింది. అంతేకాక ఈ సినిమాలో రామ్ చరణ్ పూర్తిస్థాయిలో నటించకపోవడంతో ఇప్పుడు అందరూ రాంచరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
నిజానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ దశ కూడా పూర్తి చేసుకోవాల్సింది. కానీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న శంకర్ మధ్యలో ఇండియన్ 2 అనే సినిమా లైన్ వచ్చేసరికి ఈ సినిమా గేమ్ చేంజర్ కాస్త ఆలస్యమైంది. నెలలు సగం రోజులు ఇటు సగం రోజులు అటు అన్నట్టుగా శంకర్ సినిమాలను పూర్తి చేశాడు. అయితే ఇప్పుడు గేమ్ చేజర్ కొత్త షెడ్యూల్ శంకర్ స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మైసూర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్న రామ్ చరణ్ దగ్గర లో ఉన్న ఫేమస్ ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు.
ఇక దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఇక రామ్ చరణ్ కి దైవభక్తి ఎక్కువ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే రామ్ చరణ్ చాలాసార్లు అయ్యప్ప మాలదరణ కూడా చేశారు. ఇక ఆ సమయంలో నియమనిష్టలతో వ్యవహరిస్తూ ఉంటారు. అయితే తాజాగా మైసూర్ లోని చాముండేశ్వరి దేవాలయానికి వెళ్లిన రామ్ చరణ్ అక్కడ వేసిన దక్షిణ గురించి చర్చలు సాగుతున్నాయి. మొదట అయ్యగారికి నమస్కరించటంతో రామ్ చరణ్ సింప్లిసిటీ గురించి చర్చించుకున్నారు. అనంతరం హారతి తీసుకునేటప్పుడు దక్షణగా రామ్ చరణ్ పెద్ద మొత్తాన్ని వేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More