K Viswanath : కె. విశ్వనాథ్ అంత్యక్రియలు ఇలా చేసారేంటి ! కారణం ఏమై ఉంటుంది ?

K Viswanath : కళాతపస్వి కె విశ్వనాథ్ ఇటీవల అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 2న మృతి చెందారు. ఇక టాలీవుడ్లో విశ్వనాధ్ గారి సినిమాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వాతిముత్యం, సాగర సంగమం, శంకరాభరణం వంటి ఆణిముత్యాలు లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు విశ్వనాధ్. ఐదు జాతీయ అవార్డులను కూడా దక్కించుకున్నారు. విశ్వనాథ్ టాలీవుడ్ కి ఎనలేని కీర్తి ప్రతిష్టలను అందించారు. అయితే ప్రస్తుతం విశ్వనాథ్ అంత్యక్రియల గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇటీవల హైదరాబాదులో విశ్వనాధ్ అంత్యక్రియలు జరిగాయి.

బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం మరణించిన తర్వాత పార్దివ దేహాన్ని దహనం చేస్తారు. ఆ తర్వాత అస్తికలను నదుల్లో నిమజ్జనం చేస్తారు. కానీ విశ్వనాధ్ గారిని కూర్చోబెట్టి ఖననం చేశారు. దీనికి కారణం విశ్వనాధ్ పూర్వీకులు కర్ణాటక నుంచి వచ్చిన వీర శైవ ఆరాధ్యులు అని తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణులతో పోలిస్తే వీరికి ప్రత్యేక సాంప్రదాయాలు ఉంటాయి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వీరశైవ ఆరాధ్యులు ఎక్కువగా ఉంటారు. అయితే వీరంతా ఆ రోజుల్లో నియోగి బ్రాహ్మణులతో వివాహ బంధాలు ఏర్పరచుకుని మిగిలిన బ్రాహ్మణులతో కలసిపోయారు.

వీర శైవులను లింగధారులు అని కూడా పిలుస్తారు. అందుకే చనిపోయినప్పుడు దేహం పై ఉన్న లింగాన్ని తొలగించారు అని అంటుంటారు. పార్థివ దేహాన్ని దహనం చేయకుండా ఖననం చేస్తారని చెబుతుంటారు. శివలింగం చెక్కు చెదరకుండా ఉండడానికి ఇలా ఖననం చేస్తారని చెబుతుంటారు. అందుకే విశ్వనాథ్ అంత్యక్రియలు ఇలా చేశారు. అలాగే ఎస్పీ బాల సుబ్రమణ్యం అంత్యక్రియలు కూడా ఇదే సంప్రదాయం లో చేశారు. ప్రస్తుతం వీరి అంత్యక్రియల గురించి జనాలు చర్చించుకుంటున్నారు.

Must Read : Surekha Vani : అందం తో సోషల్ మీడియాని ఊపేస్తున్న సురేక వాణి…

admin

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More