Athadu Movie Child Artiste : సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి సినిమా అతడు. అయితే అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనే రేంజ్ లో ఆడింది. కానీ టెలివిజన్ లో టెలికాస్ట్ లు మాత్రం ఈ సినిమా బాహుబలి రేంజ్ అని చెప్పొచ్చు. ఈ సినిమాను ఎన్నిసార్లు టెలికాస్ట్ చేసినా సరే ఆడియన్స్ మాత్రం పనులన్నీ మానుకుని మరి చూస్తూనే ఉంటారు. మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ మ్యాజిక్ అంటే ఇలాగే ఉంటుంది మరి. చూస్తుంటే సినిమా చాలా సింపుల్ గా కనిపిస్తుంది కానీ పదేపదే చూడాలి అనిపిస్తుంది.
అంతేకాక ఈ సినిమాలో మహేష్ బాబు సైలెంట్ యాక్టింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగ్స్ అయితే ఇప్పటికీ ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే సినిమాలో మహేష్ బాబు త్రిష ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న పిల్లల గ్యాంగ్ ఉంటుంది. అందులో బ్రహ్మానందం కొడుకుగా నటించిన బుడ్డోడు అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ బుడ్డోడు పెరిగి పెద్దవాడై హీరో కూడా అయాడు. అతడు ఎవరో ఒకసారి చూద్దాం పదండి… “అతడు” సినిమాలో నటించిన ఈ బుడ్డోడు పేరు దీపక్ సరోజ్..చైల్డ్ ఆర్టిస్ట్ గా తను చాలా సినిమాల్లో నటించాడు. “అతడు” సినిమా తర్వాత చైల్డ్ ఆర్టిస్టుగా ఆర్య , పెద్దబాబు, ఆంధ్రుడు, భద్ర మరియు లెజెండ్ వంటి సినిమాలలో నటించి మెప్పించాడు.
ఇక ఆ తర్వాత 2014వ సంవత్సరంలో దీపక్ సరోజ్ “మినుగురు” అనే సినిమాలో ప్రధాన పాత్రలో అద్భుతంగా నటించి నేషనల్ అవార్డుని కూడా దక్కించుకున్నాడు. ఆ తర్వాత “వందనం” అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అయితే ఈ సినిమా ఎవరికి తెలియదు. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది ఎప్పుడు థియేటర్స్ వచ్చి వెళ్ళిందో కూడా ఎవరికీ తెలియదు. దీంతో దీపక్ పేరు అంతగా సినీ ఇండస్ట్రీలో వినిపించడం లేదు. ఇక ఇప్పుడు తాజాగా దీపక్ “సిద్ధార్ రాయ్” అనే సినిమాతో మోస్ట్ హ్యాండ్సమ్ లుక్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుందని సమాచారం. మరి ఈ సినిమాతో అయిన దీపక్ సరోజ్ ఇండస్ట్రీలో తన పేరును నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి మరి.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More